Telugu News » Blog » కోహ్లీ కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చిన అతని మేనేజర్..!

కోహ్లీ కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చిన అతని మేనేజర్..!

by Manohar Reddy Mano
Ads

ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో అలాగే ఇండియాలో ఎక్కువగా క్రికెట్ గురించే చర్చ అనేది జరుగుతున్న విషయం తెలిసిందే. అతని ఫామ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్న సమయంలోనే కోహ్లీ తాజాగా చేసిన కామెంట్స్ అనేవి ఇంకా ఎక్కువ చర్చకు కారణం అయ్యాయి. తాజాగా కోహ్లీ.. నా చుట్టూ ఎంత మంది ఉన్న నేను ఒంటరిగా ఫీల్ అయ్యా అంటూ కొన్ని కామెంట్స్ అనేవి చేసాడు.

Ads

దాంతో కొంతమంది ఈ విషయంలో బీసీసీఐని తప్పుబట్టగా.. ఇంకొందరు అయితే కోహ్లీ మొత్తం డిప్రెషన్‌ లోకి వెళ్ళిపోయాడు అని కామెంట్స్ చేయడం ప్రారంభించాడు. ఇలా కోహ్లీ చేసిన వ్యాఖ్యలపై జరుగుతున్న చర్చపైన విరాట్ మేనేజర్ బంటీ సాజ్దే క్లారిటీ అనేది ఇచ్చాడు. తాజాగా బంటీ సాజ్దే మాట్లాడుతూ.. విరాట్ చేసిన కామెంట్స్ ను అందరూ తప్పుగా అర్ధం చేసుకున్నారు. డిప్రెషన్‌ అంటే ఏంటో కోహ్లీ బాగా తెలుసు.

Ads

కోహ్లీ తన కెరియర్ లో కొంచెం ఎదిగిన తర్వాత మెంటల్ ఛాలెంజెస్ అనేవి ఎదుర్కున్నాడు. కానీ ఎప్పుడు డిప్రెషన్‌ గురి కాలేదు. కోహ్లీ చుట్టూ ఎప్పుడు చాలా మంది ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా ఒంటరిగా ఫీల్ అవుతే వారిలో కలిసిపోవాలని చూస్తాడు. ఇక ఎన్నో అంచనాలను.. ఒత్తిడిని ఎదుర్కొన తర్వాత కోహ్లీ ఈ స్థాయికి వచ్చాడు. అయితే కోహ్లీ మెంటల్ పొజిషన్ అనేది ఎప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అని మేనేజర్ బంటీ సాజ్దే అభిమానులకు ఓ క్లారిటీ అనేది ఇచ్చాడు.

Ad

ఇవి కూడా చదవండి :

జాతీయగీతం పడుతున్న కిషన్ పై పాకిస్థాన్ తుమ్మెద దాడి..!

మళ్ళీ బ్యాట్ పట్టనున్న గౌతమ్ గంభీర్..!