Home » జాతీయగీతం పడుతున్న కిషన్ పై పాకిస్థాన్ తుమ్మెద దాడి..!

జాతీయగీతం పడుతున్న కిషన్ పై పాకిస్థాన్ తుమ్మెద దాడి..!

by Azhar
Ad
భారత జట్టు యువ ఆటగాళ్లలో ఇషాన్ కిషన్ ఇప్పుడు మంచి ప్రదర్శన అనేది చేస్తున్నాడు. తన ఆటతో ఏకంగా గత ఏడాది ప్రపంచ కప్ కు ఎంపికైన కిషన్.. ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర అనేది పలికాడు. కానీ దానికి తగ్గిన ప్రదర్శన అనేది చేయలేదు. ఆ తర్వాత ఇండియా జట్టులో కూడా కిషన్ పెద్దగా ఆకట్టుకోలేదు. అందుకే ఈ మధ్య ఇండియా తుది జట్టులో కిషన్ కు ఆకాశం అనేది రావడం లేదు.
తుది జట్టులో ఉండకపోయినా కూడా ఇషాన్ కిషన్ ప్రతి పర్యటనకు వెళ్లే జట్టులో మాత్రం ఉంటున్నాడు. ఇక ఇప్పుడు జింబాంబ్వేకు వెళ్లిన భారత జట్టులో కూడా కిషన్ సభ్యుడిగా ఉన్నాడు. కానీ నిన్న జరిగిన మొదటి వన్డే తుది జట్టులో లేదు. అయితే ఈ మ్యాచ్ కు ముందు కిషన్ విషయంలో ఓ ఘటన జరిగింది. అక్కడ మ్యాచ్ కు ముందు ఆటగాళ్లు అందరూ మన జాతీయ గీతం పడుతున్నారు.
ఇషాన్ కిషన్ కూడా కళ్ళు మూసుకొని జనగణమన పడుతుంటే.. ఉన్నట్టుండి ఓ తుమ్మెద అనేది వచ్చి కిషన్ చెవిలోకి వెళ్ళడానికి ప్రయత్నించింది. దాంతో ఒక్కసారిగా కళ్ళు తెరిచి కిందకు వంగిన కిషన్.. అది వెళ్లిపోయిన తర్వాత మళ్ళీ పైకి లేచి జాతీయగీతం పాడాడు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో క్లిప్ పై మన అభిమానులు అది పాకిస్థాన్ తుమ్మెద అంటూ సరదా కామెంట్స్ అన్వేయి చేస్తున్నారు.

Advertisement

Visitors Are Also Reading