Home » ఒకే ప్రేమ్‌లో మ‌హేష్ బాబు కుమారుడు గౌత‌మ్ కృష్ణ‌, కూతురు సితార‌..!

ఒకే ప్రేమ్‌లో మ‌హేష్ బాబు కుమారుడు గౌత‌మ్ కృష్ణ‌, కూతురు సితార‌..!

by Anji
Ad

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మహేష్ బాబు తనయుడిగా గౌతం కృష్ణతో పాటు తనయ సితారకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. వీళ్ళకు సంబంధించిన ఏ చిన్న అప్‌డేట్ అయినా స‌రే అభిమానులు ఎంతో ఆసక్తిగా ప్రదర్శిస్తుంటారు. తాజాగా వీళ్ళిద్దరూ బాయ్ దూజ్ సందర్భంగా కలిసి ఉన్న ఫోటోలను అభిమానులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. గౌతమ్ కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ మనవడిగా మహేష్ బాబు కొడుకుగా మంచి ఫాలోయింగ్ ఉంది. తొలిసారి సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన నేనొక్కడినే సినిమాలో బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. అందులో చిన్నప్పటి మహేష్ బాబు పాత్రలో నటించాడు.

Also Read : చిరంజీవి, బాల‌కృష్ణ‌ల‌ను నిర్మాత దిల్ రాజు భ‌య‌పెడుతున్నారా..! ఎందుకంటే ?

Advertisement

సితార కూడా రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన ప్రమోషన్ సాంగ్‌లో నటించింది. ఈ పాట సినిమాలో లేకపోయినా ప్రమోషన్స్ లో మాత్రం ఈ పాటలో సితార ఓ రేంజ్ లో హల్ చల్ చేసింది. ఇక మహేష్ బాబు తనయుడు గౌతం కృష్ణ ను చూస్తే తండ్రి మహేష్ బాబులాగానే ఉన్నాడని చెప్పొచ్చు. తండ్రికి జిరాక్స్ కాపీల ఉన్నాడనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అంతేకాదు.. తండ్రికి తగ్గట్టు ఇతను కూడా ఆరడుగుల ఆజానుబాహుడిగా కనిపిస్తుంటాడు. మహేష్ బాబు విషయానికి వస్తే.. ఈయనకు ఈ ఏడాది అంతగా కలిసి రాలేదని చెప్పాలి. ఈ సంవత్సరం అన్నయ్య రమేష్ బాబు తో పాటు తల్లి ఇందిరా దేవి మృతి మహేష్ బాబును కృంగదీసిందనే చెప్పాలి.

Advertisement

Also Read :  అమ్మ బాబోయ్: స్టైలిష్ స్టార్ భార్య ధరించిన చీర ధర ఎంతంటే..?

ఈ ఏడాది మహేష్ బాబు ‘సర్కార్ వారి పాట’ సినిమాతో పలకరించారు. పరశురామ్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ మహేష్ బాబు సొంత బ్యానర్ తో పాటు 14 రీల్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసింది. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. హీరోగా మహేష్ బాబుకు ఇది 28వ సినిమా. ఈ సినిమాలో సూపర్ స్టార్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. మహేష్ బాబు త్రివిక్రమ్ మూవీ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ప్యాన్ వరల్డ్ మూవీ చేయనున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళనుంది. 2024లో ఈ సినిమా విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు.

Also Read : బోణీ క‌పూర్ శ్రీదేవి మ‌ధ్య గొడ‌వ‌లు..! అతిలోక సుంద‌రి తీసుకున్న ఆ నిర్ణ‌యం వ‌ల్లే ప్రాణాలు కోల్పోయిందా.?

 

Visitors Are Also Reading