Home » అమ్మ బాబోయ్: స్టైలిష్ స్టార్ భార్య ధరించిన చీర ధర ఎంతంటే..?

అమ్మ బాబోయ్: స్టైలిష్ స్టార్ భార్య ధరించిన చీర ధర ఎంతంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

సినీ ఇండస్ట్రీ కి సంబంధించిన హీరో హీరోయిన్ వారి కుటుంబ సభ్యులు గురించి ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా అది సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారుతుంది. అలాంటిది స్టైలిష్ స్టార్ బన్నీ అంటే ఇక వేరే లెవెల్.. ఆయన భార్య స్నేహారెడ్డి గురించి ప్రస్తుతం ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. బన్నీకి టాలీవుడ్ లో ఎంతటి క్రేజ్ ఉందో ఆ స్థాయిలోనే స్నేహారెడ్డికి కూడా క్రేజ్ ఉందని చెప్పవచ్చు.

Advertisement

also read:Sr.NTR కు ఆ హీరోయిన్ తో ఎఫైర్..కానీ ఎన్టీఆర్ ఇచ్చిన ట్విస్టుతో అంతా సైలెంట్..!!

అయితే తాజాగా స్నేహ రెడ్డి ధరించిన చీర సోషల్ మీడియాలో వైరల్ కాగా దాని ఖరీదు తెలిసి చాలా మంది నెటిజన్లు షాక్ అవుతున్నారు..మరి ఇంతకీ ఆ చీర ధర ఎంత అనుకుంటున్నారా.. అక్షరాల ఒక లక్షా 76 వేల రూపాయలు.ఈ చీరకట్టులో స్నేహారెడ్డి చాలా అందంగా కనిపిస్తున్నారని నెటిజన్ల నుండి కామెంట్ల వర్షం కురుస్తోంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయినా స్నేహ రెడ్డి అందం ఏ మాత్రం తగ్గలేదని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

అయితే ఈ చీరను ప్రముఖ డిజైనర్ లో ఒకరైన రిమ్జిమ్ దాదు రూపొందించారని సమాచారం. మెటాలిక్ కార్డ్స్ తో ఈ చీరలు తయారు చేయడం ప్రత్యేకం. ఇక బన్నీ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన పుష్ప -2 సినిమాలో నటిస్తున్నారు. పుష్ప -2 అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.. ఈ సినిమా 2023 లో విడుదల కావడం కష్టమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో బన్నీ మరియు స్నేహారెడ్డి కలిసి ఏదైనా సినిమాలో నటిస్తే చూడాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి అభిమానుల కోరిక తీరుతుందో లేదో వేచి చూడాలి.

also read:

Visitors Are Also Reading