Home » మారని ముంబై తీరు.. లక్నో విక్టరీ..!

మారని ముంబై తీరు.. లక్నో విక్టరీ..!

by Azhar
Ad
ఐపీఎల్ 2022 లో ఈ రోజు జరిగే రెండు మ్యాచ్ లలో భాగంగా మొదటి మ్యాచ్ లక్నో సూపర్ జెంట్స్ – ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది. ఇప్పటికే వరుసగా 5 మ్యాచ్ లలో ఒదిన ముంబై ఈ మ్యాచ్ లోనైనా మొదటి విజయం సాధిస్తుంది అనుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో తో గెలిచిన రోహిత్ శర్మ బౌలింగ్ తీసుకున్నాడు.
దాంతో మొదట బ్యాటింగ్ కు వచ్చిన లక్నో ను ముంబై కట్టడి చేయలేకపోయింది. ఓపెనర్ గా వచ్చిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. మొత్తం 60 బంతుల్లో 5 సిక్సర్లు, 9 ఫోర్లతో 103 పరుగులు చేసి చివరి వరకు నాటౌట్ గా నిలిచాడు. అలాగే మరో ఓపెనర్ డికాక్ (24), మనీష్ పాండే (38) పరుగులు చేయడంతో నిర్ణిత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది లక్నో టీం. ఇక ముంబాయి బౌలర్లలో జయదేవ్ ఉనాద్కట్ రెండు వికెట్లు తీయగా.. మురుగన్ అశ్విన్, ఫాబియన్ అలెన్ ఒక్కో వికెట్ పడగొట్టాడు.
అనంతరం 200 పరుగుల భారీ లక్ష్యంతో వచ్చిన ముంబైకి మొదట్లోనే షాక్ ఇచ్చారు లక్నో బౌలర్లు. కెప్టెన్ రోహిత్ శర్మ 6 పరుగులకే పెవిలియన్ చేరగా.. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ 13 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అనంతరం డెవాల్డ్ బ్రెవిస్ (31), సూర్యకుమార్ యాదవ్ (37) కొంత పర్వాలేదు అనిపించారు. ఇక తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 26 పరుగులు చేయగా… పోలార్డ్ 25 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇక ఆ తర్వాత లోయర్ ఆర్డర్ లో ఎవరు రాణించకపోవడంతో ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 181 పరుగులు మాత్రమే చేసి.. ఈ ఐపీఎల్ 2022 లో వరుసగా 6వ ఓటమిని మూటగట్టుకుంది. ఈ ఓటమితో దాదాపుగా ప్లే ఆఫ్స్ రేస్ నుండి ముంబై తప్పుకోగా.. గెలిచిన లక్నో పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి వెళ్ళింది.
ఇవి కూడా చదవండి :

Advertisement

Visitors Are Also Reading