Home » లీకైన వెంకటేష్ సైందవ్ సినిమా స్టోరీ ఇదే.. హిట్ కొట్టేనా ?

లీకైన వెంకటేష్ సైందవ్ సినిమా స్టోరీ ఇదే.. హిట్ కొట్టేనా ?

by Anji
Ad

టాలీవుడ్ అగ్ర నిర్మాత కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు విక్టరీ వెంకటేష్.  తక్కువ సమయంలోనే సక్సెస్ ఫుల్  హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు. బొబ్బిలిరాజా లాంటి సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి మాస్ హీరోగా మంచి గుర్తింపు సాధించాడు వెంకటేష్. ముఖ్యంగా వెంకటేష్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి విపరీతమైన ఇష్టముంది. ఇప్పటికీ లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్న హీరో ఎవరంటే అందరూ వెంకటేష్ అనే చెబుతారు.వెంకటేష్ అన్ని రకాల పాత్రల్లో నటించి ప్రేక్షకులు మెప్పించారు.  

Also Read :  “గీతాగోవిదం” నీలూ గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Advertisement

కానీ  గత కొద్ది రోజులుగా వెంకటేష్ సోలోగా సక్సెస్ సాధించలేకపోతున్నాడనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. వెంకటేష్ తో పాటు ఉన్నటువంటి  హీరోలు చిరంజీవి, బాలకృష్ణ రూ.100 కోట్ల కలెక్షన్లు ని కొల్లగొడుతుంటే వెంకటేష్ మాత్రం ఇంకా సోలో సక్సెస్ కోసం చాలా కష్టాలు పడుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. దీంతో వెంకటేష్ రూట్ మార్చి హిట్ సిరీస్ లో టాలెంట్ దర్శకునిగా పేరు తెచ్చుకున్నటువంటి శైలేష్ కొలను దర్శకత్వంలో సైందవ్ అనే టైటిల్ తో ఓ పవర్ పుల్ మూవీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ స్టోరీ లీక్ అయిందని..  సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా  వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.  

Advertisement

Also Read :  చిరంజీవికి పక్కన హీరోయిన్ లా, తల్లిగా నటించిన స్టార్ హీరోయిన్స్ ఎవరంటే ??

ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ పవర్ పుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని..  తన డ్యూటీలో కొంతమంది రౌడీలతో గొడవకు దిగుతాడని, ఆ గొడవల్లో భాగంగా ఫ్యామిలీ మొత్తాన్ని కోల్పోతాడు. ఫ్యామిలీతో పాటు ఉద్యోగాన్ని కూడా కోల్పాతాడని.. ఇలా అన్ని కోల్పోయిన తరువాత వెంకటేష్ రౌడిలపై రివేంజ్ తీర్చుకోవడమే పనిగా పెట్టుకొని తన ఫ్యామిలీ చావుకి కారణమైన ప్రతీ ఒక్కరినీ వెతికి మరీ చంపుతాడు. ఈ సినిమా స్టోరీ అని ఇదే తెలుస్తోంది. తాను తీసిన రెండు సినిమాల్లో నటించిన హీరోలు చిన్న హీరోలు కావడంతో వాళ్లను డీల్ చేశారు. కానీ ఫస్ట్ టైమ ఓ స్టార్ హీరోని డీల్ చేస్తున్నాడు దర్శకుడు శైలేష్. ఈ చిత్రం హిట్ పడితే వరుసగా పెద్ద హీరోలతో సినిమాలు చేసే అవకాశం తప్పకుండా లభిస్తుందనే చెప్పవచ్చు. వెంకటేష్ సైందవ్ ఎలా ఉంటుందో వేచి చూడాలి మరి.  

Also Read :  మోహన్ బాబు వలన సినిమా ఛాన్స్ మిస్ చేసుకుని నేడు కోట్లు సంపాదిస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా ??

Visitors Are Also Reading