Home » చిరంజీవికి పక్కన హీరోయిన్ లా, తల్లిగా నటించిన స్టార్ హీరోయిన్స్ ఎవరంటే ??

చిరంజీవికి పక్కన హీరోయిన్ లా, తల్లిగా నటించిన స్టార్ హీరోయిన్స్ ఎవరంటే ??

by AJAY
Ad

సినిమా ఇండస్ట్రీలో హీరోల‌కు ఎక్కువ లైఫ్ ఉంటుంది కానీ హీరోయిన్ ల లైఫ్ చాలా త‌క్కువ‌. మ‌హా అయితే ఒక హీరోయిన్ ప‌దేళ్ల పాటూ హీరోయిన్ పాత్ర‌లు చేస్తుంది. అంతకు మించి చేసినా సీనియ‌ర్ హీరోల‌కు జోడీ క‌ట్టాలి. ఒక‌వేల ఫిట్నెస్ కోల్పోయిందంటే సీనియ‌ర్ హీరోల సినిమాల‌లో కూడా ఆఫ‌ర్ లు ఈజీగా రావడం క‌ష్ట‌మే. అంతే కాకుండా కొంత‌మంది హీరోయిన్ లు ఒకే హీరోకు త‌ల్లిగా ఆయ‌న ప‌క్క‌న హీరోయిన్ గా చేసిన సంధర్బాలు కూడా లేక‌పోలేదు.

Advertisement

అలా ఓ హీరోయిన్ చిరంజీవికి హీరోయిన్ గా మ‌రియు ఆయ‌న‌కు త‌ల్లిగా న‌టించింది. ఇంత‌కీ ఆ హీరోయిన్ ఎవ‌రు..? ఆమె ఆ సినిమాలు ఏంటి అన్న వివ‌రాలు ఇప్పుడు చూద్దాం…..స‌హ‌జన‌టి జ‌య‌సుధ చిరంజీవి తో జోడీ కట్టి ఆ త‌ర‌వాత ఆయ‌నకే తల్లిగా ఓ సినిమాలో న‌టించారు. చిరంజీవి హీరోగా మ‌గ‌ధీరుడు అనే సినిమా తెరెక్కింది. ఈ సినిమాలో హీరోయిన్ గా జ‌య‌సుధ న‌టించారు.

Advertisement

Jayasudha

అంతే కాకుండా ఇది క‌థ కాదు సినిమాలో కూడా జ‌య‌సుధ చిరంజీవి హీరో హీరోయిన్ లుగా న‌టించి మెప్పించారు. ఇదిలా ఉంటే రిక్షావోడు సినిమాలో జ‌య‌సుధ చిరంజీవికి త‌ల్లిగా న‌టించింది. అంతే కాకుండా ప్రేమ త‌రంగాలు సినిమాలో హీరోయిన్ సుజాత మరియు చిరంజీవి హీరో హీరోయిన్ లుగా న‌టించారు. అయితే వీరిద్ద‌రూ సీతాదేవి సినిమాలో వీరిద్ద‌రూ అన్నా చెల్లెల్లుగా కూడా న‌టించారు.

chiranjeevi sujatha

chiranjeevi sujatha

అయితే అక్క‌డితో ఆగ‌కుండా చిరంజీవి హీరోగా న‌టించిన బిగ్ బాస్ సినిమాలో కూడా సుజాత న‌టించారు. కాగా ఈ సినిమాలో ఏకంగా చిరంజీవికి సుజాత ఏకంగా త‌ల్లి పాత్ర‌లో న‌టించాల్సి వ‌చ్చింది. కేవ‌లం చిరంజీవికి మాత్ర‌మే ఇలాంటి అనుభవం లేదు. ఎన్టీఆర్ ప‌క్క‌న హీరోయిన్ గా న‌టించిన హీరోయిన్ ఆయ‌న‌కు త‌ల్లిగా న‌టించిన సంధ‌ర్బం కూడా ఉంది. అదేవిధంగా ఏఎన్ఆర్ కు కూడా జ‌రిగింది.

ALSO READ :‘హిమాన్షు’ మరో అరుదైన ఘనత… మనవడికి సీఎం కేసీఆర్ ఆశీర్వాదం…

Visitors Are Also Reading