Home » స‌చిన్ సాయం అడిగిన కోహ్లీ.. ఎందుకంటే..?

స‌చిన్ సాయం అడిగిన కోహ్లీ.. ఎందుకంటే..?

by Anji
Published: Last Updated on

టీమిండియా స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీపై ప్ర‌శంస‌లు కురిపించాడు క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్‌. కోహ్లీ త‌న కెరీర్ రూపుదిద్దుకుంటున్న తీరు ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశాడు. విరాట్ త‌న కెరీర్ ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశాడు. విరాట్ త‌న ఆట‌ను మెరుగుప‌రుచుకోవ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డ్డామ‌ని స‌చిన్ చెప్పుకొచ్చాడు. విరాట్ నాకు మంచి స్నేహితుడు గ‌త ద‌శాబ్ద‌కాలంగా అత‌ని కెరీర్‌రూపుదిద్దుకున్న తీరు ప‌ట్ల సంతోషంగా ఉన్నా.. అత‌ను అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేసిన స‌మ‌యానికే నేను జ‌ట్టులో స‌భ్యునిగా ఉన్న‌ప్పుడే కోహ్లీఓ ఒకే విధ‌మైన ఫైర్ చేసాను.

అక్క‌డి నుంచి త‌న ఆట‌ను మెరుగు ప‌రుచుకోవ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. అందుకు త‌గిన విధంగా త‌న జీవ‌న శైలి మార్చుకున్నాడు. అదే అత‌డి ల‌క్ష్యాలు సాధించ‌డానికి దోహ‌ద‌ప‌డిందని స‌చిన్ పేర్కొన్నాడు. గ‌తంలో విరాట్ కోహ్లీని క‌లిసిన విష‌యాన్ని స‌చిన్ గుర్తు చేసుకున్నాడు. ఆ స‌మ‌యంలో విరాట్ త‌న సాయం కోరాడు అని స‌చిన్ వెల్ల‌డించారు. త‌న ఆట తీరులో లోటుపాట్లు గురించి చ‌ర్చించిన‌ట్టు పేర్కొన్నాడు. ఈ త‌రుణంలోనే యువ ఆట‌గాళ్ల‌తో త‌న‌కు తెలిసిన విష‌యాల‌ను పంచుకోవ‌డంలో తాను ఎప్పుడు ముందుంటాన‌ని చెప్పాడు.

2014లో నేను అత‌న్ని క‌లిసిన‌ట్టు గుర్తుకు ఉంది. అప్పుడు విరాట్ నా సాయం కోరాడు. బ్యాటింగ్‌లో లోటుపాట్ల గురించి చ‌ర్చించేందుకు త‌న‌కు స‌మ‌యం కేటాయింలాని రిక్వెస్ట్ చేసాడు. ఆ స‌మ‌యంలోనే అత‌ను మెరుగుప‌డాల‌ని కొన్ని విస‌యాల గురించి మాట్లాడుకున్నామ‌ని స‌చిన్ వెల్ల‌డించారు. విరాట్ గ‌త కొద్ది కాలంగా ఫామ్ కోల్పోయి రాణించ‌లేక‌పోతున్నాడు. అత‌ను సెంచ‌రీ సాధించి రెండేండ్లు దాటిపోయింది. ఈ నేప‌థ్యంలో కోహ్లీ మునుప‌టి ఫామ్‌ను అందుకోనేందుకు ఓ సారి స‌చిన్ ను క‌ల‌వాల‌ని ప‌లువురు మాజీ క్రికెట‌ర్లు సూచిస్తున్నారు.

Also Read :  మరొక మూడు పర్యటనలకు బీసీసీఐ ప్లాన్

Visitors Are Also Reading