Home » కిమ్ సాగుబాట‌.. భూమిలో బాంబు పేల్చి శంకుస్థాప‌న

కిమ్ సాగుబాట‌.. భూమిలో బాంబు పేల్చి శంకుస్థాప‌న

by Anji
Published: Last Updated on
Ad

ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఏది చేసిన ఓ వైరెటీనే. తాజాగా అదేవిధంగా ఓ వెరైటీ ఘ‌ట‌న చోటు చేసుకుంది. కిమ్ సాగుబాట ప‌ట్టారు. దేశ ప్ర‌జ‌ల ఆహ‌రపు ప్ర‌మాణాలు మెరుపిచే దిశ‌గా అడుగులు వేస్తూ.. కూర‌గాయ‌ల కొర‌త‌ను అధిగ‌మించేందుకు న‌డుంబిగించారు. ఉత్త‌ర‌కొరియాలో రెండ‌వ అతిపెద్ద న‌గ‌రం అయిన హ‌మ్‌హంగ్ స‌మీపంలో అతిపెద్ద గ్రీన్ హౌస్ వ్య‌వ‌సాయ క్షేత్రానికి శంకుస్థాప‌న చేశారు. భారీగా వ‌చ్చిన సైనికుల మ‌ధ్య మంచుతో పేరుకుపోయిన మ‌ట్టిని బాంబుతో పూల్చి ప‌నుల‌ను ప్రారంభించ‌డానికి శ్రీ‌కారం చుట్టారు కిమ్‌.

Also Read :  భార‌త్‌పై మ‌ళ్లీ దావూద్ ఇబ్ర‌హీం గురి..!

Advertisement

Advertisement

శీతాకాలంలో కూర‌గాయ‌లు ల‌భించ‌క ఉత్త‌ర కొరియ‌న్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చ‌లికాలంలో కూర‌గాయ‌లు దొర‌క‌క‌పోవ‌డంతో వాటికి బ‌దులు ప‌చ్చ‌ళ్లు, ఎండిన కూర‌గాయాల‌పై ఆధార‌ప‌డుతున్నారు. శీతాకాలంలో ప్ర‌జ‌లు వీటిని తిన‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు ఏర్ప‌డుతున్నాయి. ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించేందుకు ఎలాంటి వాతావ‌ర‌ణంలోనైనా ఏడాది అంతా పంట‌లు పండించేందుకు కిమ్ సంక‌ల్పించారు.

కొన్నేళ్ల నుంచి దీనికి ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న ఆయ‌న అంత‌ర్జాతీయ, స్థానిక సంస్థ‌ల స‌హ‌కారంతో గ్రీన్‌హౌస్ ఫామ్ హౌస్ నిర్మాణానికి పూనుకున్నారు. ఇక్క‌డ ఏడాది పొడ‌వునా కూర‌గాయలు పండించే అవ‌కాశం ఉంటుంది. ప్ర‌ధాన నిర్మాణ ప్రాజెక్టుల కోసం మాత్ర‌మే ఉప‌యోగించే సైన్యాన్ని ఈ వ్య‌వ‌సాయ క్షేత్ర ప‌నికి ఉప‌యోగిస్తున్నారు కిమ్‌. ఫామ్ హౌజ్‌కు భూమి పూజ చేసి వెనుదిరిగినా కిమ్‌ను సైనికులు అభిమానంతో చుట్టు ముట్టారు. వేలాది సంఖ్య‌లో సైనికులు వాహ‌నాన్ని చుట్టుముట్ట‌డంతో ఆయ‌న వాహ‌నం ముందుకు క‌దిలేందుకు చాలా స‌మ‌య‌మే ప‌ట్టింది.

Also Read :  ఏపీ వ‌క్ఫ్ బోర్డ్ చైర్మెన్ గా అలీ…?

Visitors Are Also Reading