Telugu News » Blog » భార‌త్‌పై మ‌ళ్లీ దావూద్ ఇబ్ర‌హీం గురి..!

భార‌త్‌పై మ‌ళ్లీ దావూద్ ఇబ్ర‌హీం గురి..!

by Anji
Ads

అండ‌ర్ వ‌రల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీం మ‌ళ్లీ భార‌త్ పై గురిపెట్టాడా..? ప్ర‌ముఖ రాజ‌కీయ నేత‌లు, వ్యాపార‌వేత్త‌ల‌ను హ‌త్య చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడా..? ఈ ప్ర‌శ్న‌ల‌కు జాతీయ ద‌ర్యాప్తు సంస్థ అవున‌నే స‌మాధానం చెబుతుంది. భార‌త్‌లో భీక‌ర దాడుల‌తో అల్ల‌క‌ల్లోలం సృష్టించేందుకు దావూద్ ఓ ప్ర‌త్యేక యూనిట్‌ను ఏర్పాటు చేసిన‌ట్టు ఎన్ఐఏ బ‌హిర్గ‌తం చేయ‌డం సంచ‌ల‌నాత్మ‌కంగా మారింది. ఇండియాటూడే క‌థ‌నం ప్ర‌కారం.. దావూద్ పై ఎన్ఐఏ ఇటీవ‌ల ఎఫ్ఐఆర్ న‌మోదు చేసింది.

Ads

Also Read :  చంద్ర‌బాబుకు అవ‌మానం.. చంద్ర‌గిరిలో కుటుంబ స్థ‌లం క‌బ్జా.. అధికారులు ఏమ‌న్నారంటే..?

Ads

దేశ‌వ్యాప్తంగా ప‌లు కీల‌క ప్రాంతాల్లో పేలుడు ప‌దార్థాలు మార‌ణాయుధాల‌తో విరుచుకుప‌డేందుకు దావూద్ ముఠా ప్ర‌ణాళిక రూపొందించింద‌ని ఎప్ఐఆర్ లో ప్ర‌స్తావించింది. ఢిల్లీ, ముంబై న‌గ‌రాల‌పై దావూద్ ప్ర‌ధానంగా దృష్టి సారించిన‌ట్టు ఎన్ఐఆర్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. దేశంలో ఉగ్ర‌వాద కార్య‌కలాపాల‌కు ఆర్థిక సాయం అందించార‌న్న ఆరోప‌ణ‌ల‌తో దావూద్ ఇబ్ర‌హీంతో పాటు అత‌డి అనుచ‌రుల‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ ఇటీవ‌లే మ‌నీ లాండ‌రింగ్ కేసు న‌మోదు చేసింది. మ‌నీలాండ‌రింగ్ కేసులో దావూద్ సోద‌రుడు ఇక్బాల్ క‌స్క‌ర్‌ను న్యాయస్థానం ఫిబ్ర‌వ‌రి 24వ తేదీ వ‌ర‌కు ఈడీ క‌స్ట‌డికి అప్ప‌గించిన విష‌యం తెలిసిన‌దే.

Ad

Also Read :  ఏపీ వ‌క్ఫ్ బోర్డ్ చైర్మెన్ గా అలీ…?