Home » షారూఖ్ ఖాన్ ‘పఠాన్’ కలెక్షన్స్ పై కాజోల్ ఆసక్తికర కామెంట్స్.. వీడియో వైరల్..!

షారూఖ్ ఖాన్ ‘పఠాన్’ కలెక్షన్స్ పై కాజోల్ ఆసక్తికర కామెంట్స్.. వీడియో వైరల్..!

by Anji
Ad

బాలీవుడ్ కథానాయిక కాజోల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తన సినిమాలతో ఇప్పటికీ అలరిస్తూనే ఉంది. పెళ్లి తరువాతనే అడపదడపా సినిమాలను చేస్తూనే ఉంది. ఈమె ఇటీవల కాలంలో వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. ఇప్పటికే లస్ట్ స్టోరీస్ 2 తో పాటు ది ట్రయల్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ లో ఈమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా ఈమె డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారం అవుతున్న ది ట్రయల్ వెబ్ సిరీస్  ప్రమోషన్ లో భాగంగా పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీగా ఉంది కాజోల్.

Advertisement

ఈ సందర్భంగా చదువులేని లీడర్స్ మనలను ఏలుతున్నారంటూ పొలిటికల్ లీడర్స్ ని టార్గెట్ చేస్తూ కాజోల్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగాయి. దీంతో ఆమె వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాజాగా ఈమె తన తోటి నటుడు షారుఖ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా ఆ హీరో అభిమానులు కాజోల్ తీరును ఎండగడుతున్నారు.ఈమో కోర్టు రూమ్ డ్రామా ది ట్రయల్ లో నటించింది. కాజోల్ లాయర్ పాత్రలో ఇరగదీసింది. తాజాగా ఈ వెబ్ సిరీస్ లో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్.. షారూఖ్ గురించి ప్రశ్నించగా.. ఆయన మంచి నటుడు అని.. ఆయనతో తనకు ఉన్న మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. వీలు అయితే ఆయనతో ఇప్పుడు ఓ రొMANటిక్ సాంగ్ లో నటిస్తానని చెప్పారు.

మరోవైపు యాంకర్ మాట్లాడుతూ.. షారూఖ్ కనిపిస్తే.. మీరు అతడిని ఏమని అడుగుతారని ప్రశ్నించగా. పఠాన్ సినిమాకు వచ్చిన అసలైన కలెక్షన్స్ ఎంతో అని అడుగుతానని చెప్పారు.పఠాన్ మూవీకి వచ్చిన అసలైన కలెక్షన్లు ఎంతో అని అడుగుతానని పేర్కొన్నారు. పఠాన్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. దీంతో మిగతా హీరోల అభిమానులు కూడా అవన్ని ఫేక్ అంటూ సోషల్ మీడియా వేదికగా రచ్చ చేశారు. ఓ ప్రాంతీయ భాష చిత్రం బాహుబలి2 ఇప్పటివరకు నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఆ సినిమాను తమ సినిమా దాటిందని చెప్పుకోవడానికే ఈ ఫేక్ కలెక్సన్లు డ్రామా ఆడారంటూ మిగతా హీరోల అభిమానులు అప్పట్లో మాట్లాడుకున్నారు. ఇక ఏది ఏమైనప్పటికీ కాజోల్.. షారూఖ్ పఠాన్ కలెక్షన్లపై మాట్లాడటంపై నెటిజన్లు రకరకాలుగా మాట్లాడుకుంటారు. షారూఖ్ అభిమానులు మాత్రం కాజోల్ మాట్లాడిన తీరుపై చాలా గరంగా ఉన్నారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

కేవలం ఆ ఒక కారణం వల్లే సినిమాల మానేశా..! అసలు విషయాన్ని బయట పెట్టిన ప్రీతి జింగానియా…!

వెబ్ సిరీస్ తో తమన్నా కల నెరవేరింది. బాలీవుడ్ లో భారీ ఆఫర్ పట్టేసింది.

సల్మాన్ ఖాన్ భజరంగీ భాయ్ జాన్ మున్ని మీకు గుర్తుందా..? ఇప్పుడెలా ఉందంటే ?

Visitors Are Also Reading