Home » వెబ్ సిరీస్ తో తమన్నా కల నెరవేరింది. బాలీవుడ్ లో భారీ ఆఫర్ పట్టేసింది.

వెబ్ సిరీస్ తో తమన్నా కల నెరవేరింది. బాలీవుడ్ లో భారీ ఆఫర్ పట్టేసింది.

by Mounika
Ad

ఒక దశాబ్ద కాలం పాటు తెలుగు, తమిళ భాషల్లో అగ్రస్థాయి హీరోయిన్గా కొనసాగింది మిల్కీ బ్యూటీ తమన్నా. ఎలాంటి స్టార్ హీరోయిన్ కైనా సరే ఒక దశలో అవకాశాలు తగ్గడం అనేది సర్వసాధారణం. తమన్నా కూడా అందుకు మినహాయింపు కాదు. కానీ ఈ అమ్మడు చిన్నా పెద్ద బడ్జెట్ చిత్రాలనే తేడా లేకుండా వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటుంది. పెద్ద సినిమాల్లో అవకాశాలు తగ్గాక.. ఆమె తనకు తాను పెట్టుకున్న కొన్ని రూల్స్‌ను బ్రేక్ చేసి లిప్ లాక్స్, ఇంటిమేట్ సీన్లలో నటించి ఒక్కసారిగా అందర్నీ ఆశ్చర్యపరిచింది.

Thamanna

Advertisement

జీ కర్దా, లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్‌ల్లో తమన్నా చేసిన ఇంటిమేట్ , లిప్ లాక్స్ సీన్లు సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేశాయి. ఇక ఈ వెబ్ సిరీస్ తో కుర్రాళ్లుకు బాగా కనెక్ట్ అయిపోయింది తమన్నా. ఇక ఈ నేపథ్యంలోనే యూత్ లో తమన్నాకి ఉన్న క్రేజ్ తో ఈ అమ్మడికి పెద్ద సినిమా అవకాశాలు లభించినట్లు కనిపిస్తోంది. హిందీలో జాన్ అబ్రహాం సరసన తమన్నా ఛాన్స్ కొట్టేసింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ‘వేదా’ పేరుతో తెరకెక్కనుంది. కల్ హో న హో సహా హిందీలో పెద్ద పెద్ద సినిమాలకు దర్శకత్వం వహించిన నిఖిల్ అద్వాని ఈ చిత్రానికి కూడా దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు..

Advertisement

తమన్నా గతంలో హిందీలో చాంద్ సా రోషన్ చెహ్రా, హిమ్మత్ వాలా, ఇట్స్ ఎంటర్టైన్మెంట్ వంటి చిత్రాలలో నటించింది. కానీ ఆ చిత్రాలు ఏవి కూడా తమన్నా బాలీవుడ్ లో నిలపడడానికి కావలసిన సక్సెస్ ని ఇవ్వలేకపోయాయి. ప్రస్తుతం వెబ్ సిరీస్ లో నటిస్తూ బాలీవుడ్ దృష్టికి తన వైపు తిప్పుకుంది తమన్నా. సినిమా అవకాశాలు కరువైన సమయానికి బాలీవుడ్ నుంచి ‘వేదా’లో అవకాశం అందుకుంది. దీనితో తమన్నా ఆశ పలిచినట్లే అనుకోవాలి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

భోళా శంకర్ నుంచి ఆసక్తికర అప్డేట్.. పవన్ పాటకు స్టెప్పులేసిన మెగాస్టార్..!

సల్మాన్ ఖాన్ భజరంగీ భాయ్ జాన్ మున్ని మీకు గుర్తుందా..? ఇప్పుడెలా ఉందంటే ?

కేవలం ఆ ఒక కారణం వల్లే సినిమాల మానేశా..! అసలు విషయాన్ని బయట పెట్టిన ప్రీతి జింగానియా…!

 

 

Visitors Are Also Reading