Home » సల్మాన్ ఖాన్ భజరంగీ భాయ్ జాన్ మున్ని మీకు గుర్తుందా..? ఇప్పుడెలా ఉందంటే ?

సల్మాన్ ఖాన్ భజరంగీ భాయ్ జాన్ మున్ని మీకు గుర్తుందా..? ఇప్పుడెలా ఉందంటే ?

by Anji
Ad

దాదాపు పదేళ్ల కిందట వచ్చిన భజరంగీ భాయ్ జాన్ మూవీ ఎంత పద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ హీరో, హీరోయిన్లుగా నటించారు. వీరితో పాటు ఈ సినిమాలో ఓ పాప తనదైన క్యూట్ నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. షాహిదా మున్నిగా ఎలాంటి మాటలు లేకుండా కేవలం హావభావాలతోనే అందరినీ ఏడిపించింది. 

Advertisement

ముఖ్యంగా ఈ సినిమా చివరిలో హర్షాలీ సీన్స్ కట్టి పడేస్తాయి. తన నటనతో ఆకట్టుకున్న ఆ అమ్మాయి పేరు హర్షాలి మల్హోత్ర. ఈ చిత్రానికి ముందు ఖుబూల్ హై వంటి కొన్ని సీరియల్స్ లో నటించింది. సల్మాన్ మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. చిన్న వయస్సులోనే బాలీవుడ్ స్టార్ డమ్ సంపాదించుకున్న హర్షాలి భజరంగి తరువాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. సోషల్ మీడియాలో మాత్రం చాలా చురుకుగా ఉంటుంది. తరచూ తన ఫోటోలను షేర్ చేస్తుంటుంది. భజరంగి భాయ్ జాన్ మూవీలో నటించేటప్పుడు హర్షాలి 1వ తరగతి చదువుతుండేది.

Advertisement

ప్రస్తుతం ఆమె వయస్సు 15 ఏళ్లు. సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంటే హర్షాలి కి దాదాపు 1.7 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. హర్షాలి ప్రస్తుతం కథక్ క్లాసులకు వెళ్తుంది.  ఇటీవలే కథక్ ట్రైనింగ్ సెంటర్ నుంచి తను బయటికీ వస్తుండగా.. కెమెరామేన్ తమ కెమెరాలను క్లిక్ అని అనిపించారు. దీంతో ఒక్కసారిగా హర్షాలి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తను చాలా అందంగా ఉందంటూ ఫ్యాన్స్ , నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అదేవిధంగా సినిమాల్లోకి ఎప్పుడొస్తావని కూడా ప్రశ్నిస్తున్నారు కొందరూ. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ఎన్టీఆర్ మూవీలో అల్లు అర్హ.. నిమిషానికి అన్ని లక్షల పారితోషికమా..?

Visitors Are Also Reading