Home » Jailer Review : ‘జైలర్’ మూవీ రివ్యూ..రజినీ దుమ్ములేపాడుగా

Jailer Review : ‘జైలర్’ మూవీ రివ్యూ..రజినీ దుమ్ములేపాడుగా

by Bunty

సూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ రోల్ లో, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలోకెక్కిన చిత్రం జైలర్. ఈ చిత్రం నేడు వరల్డ్ వైడ్ గా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. రమ్యకృష్ణన్, మర్నామీనన్, వసంత్ రవి, విజయకన్, వీటీవీ గణేష్, యోగి బాబు, శివరాజ్ కుమార్, మోహన్ లాల్ మరియు జాకీ శ్రాఫ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందించారు. అయితే… ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ మరియు వివరణ :
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా చేసిన జైలర్ కథ విషయానికి వస్తే… టైగర్ ముత్తువేల్ పాండియన్ (రజినీకాంత్) ఒక కఠినమైన జైలర్. తన జైలులో ఉన్న ఖైదీలను క్రమశిక్షణలో పెట్టి వాళ్ళని తన కంట్రోల్ లో పెట్టుకునే రేంజ్ సత్తా ఉన్నవాడు. ఆయన విధించిన నియమాలను ఆతిక్రమించే ధైర్యం ఏ ఖైదీకి కూడా లేదు. అయితే వృత్తిపరంగా ఎంత కఠినంగా ఉంటాడో… ఫ్యామిలీ మెన్ గా అంతటి ప్రశాంతవంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. అయితే ఒకరోజు తన జైలులో ఉన్న గ్యాంగ్ స్టర్ ని తప్పించబోతుంటే ముత్తు వేల్ పాండియన్ అడ్డుకొని, మళ్ళీ జైలుకు పంపుతాడు. అప్పుడు ఆ గ్యాంగ్ స్టర్ కి సంబంధించిన అనుచరులు ముత్తువేల్ కుటుంబంపై దాడి చేసి అతని కొడుకుని అతి కిరాతకంగా చంపేస్తారు.

తన కొడుకుని చంపింది వారిపై పగ తీర్చుకోవడానికి ముత్తువేల్ క్రూరుడిగా మారుతాడు. ఇక ఈ సినిమా పూర్తి స్టోరీ తెలియాలంటే సినిమా చూడాల్సింది. ఇక జైలర్ మూవీ కథపై కాపీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది హాలీవుడ్ మూవీ నోబడి కథను పోలీ ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అనిరుద్ మ్యూజిక్ కి మిశ్రమ స్పందన లభిస్తుంది. కొందరు ఆడియన్స్ బాగుంది అంటే, మరి కొందరు అతిగా వాయించేశాడు అంటున్నారు. విగ్రహాల దోపిడీ ముఠాతో హీరో ఫ్యామిలీకి వచ్చే సమస్యలు, వాటిని రజనీకాంత్ ఎలా ఎదుర్కొన్నాడనేదే స్టోరీ. యాక్షన్ సీన్స్ లో రజని అదరగొట్టారు.

ప్లస్ పాయింట్స్ :
యోగి బాబు కామెడీ
అనిరుద్ బిజిఎం

మైనస్ పాయింట్స్ :
స్టోరీలో ట్విస్టులు
స్క్రీన్ ప్లే ఎలివేషన్స్ ఆకట్టుకున్నాయి.
జాకీశ్రాఫ్, శివరాజ్ కుమార్, మోహన్ లాల్ తమ పాత్రలకు న్యాయం చేశారు.
రొటీన్ సాగదీత స్టోరీ, కొన్ని సీన్లు పాత సినిమాలను తలపించేలా ఉండడం

రేటింగ్ : 3/5

ఇవి కూడా చదవండి

Nayanatara : నయనతార మొత్తం ఆస్తుల విలువ ఎంతో తెలుసా ?

విజయ్ తొడలపైన సమంత…నాగచైతన్య ఫ్యాన్స్ ఆగ్రహం !

సుమంత్ కీర్తి రెడ్డికి విడాకులు ఇవ్వడం వెనుక అసలు సీక్రెట్ ఇదేనా..?

 

Visitors Are Also Reading