Home » స‌మంత రియ‌ల్ స్టోరినే య‌శోద సినిమా క‌థ‌నా..?

స‌మంత రియ‌ల్ స్టోరినే య‌శోద సినిమా క‌థ‌నా..?

by Anji
Ad

 

టాలీవుడ్ టాప్ హీరోయిన్‌ల‌లో ఒక‌రైన స‌మంత ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు బాలీవుడ్ లో వెబ్ సిరీస్ చేస్తోంది. ఈమె ప్ర‌ధాన‌ పాత్రలో చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు యశోద, శాకుంతలం. ఇక‌ యశోద సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో హరి-హరీష్ స్వీయ‌ రచన, దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. శ్రీ దేవీ మూవీస్ పతాకం పై శివ లెంక కృష్ణ‌ప్రసాద్ నిర్మిస్తున్నారు.

Also Read : జెనీలియాకు రితేష్ కంటే ముందే వేరే వ్యక్తితో పెళ్లి చేశానంటూ కేసు పెట్టిన పంతులు..!!

Advertisement

తమిళ, తెలుగు ద్వి భాష చిత్రంగా వస్తున్న యశోదలో సమంతతో పాటు ముకుందన్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో న‌టించ‌నున్నారు. కాగా ఈ చిత్రం నవంబర్ 11న విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమాకు స్టోరీ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త‌ తెగ వైరల్ అవుతోంది. అంతే కాకుండా ఈ స్టోరీని సమంత నిజ జీవితానికి కూడా పోల్చుతున్నారు. ఆ స్టోరీ ఏంటంటే.. చిత్రంలో ముకుందన్ ఒక మెడిసిన్ ను కనిపెడుతాడు. దానిని తీసుకుంటే వయస్సు కాస్త చిన్నగా కనిపిస్తుంది. అదేవిధంగా ఆ మెడిసిన్ తీసుకున్న వారిలో మార్పులు వ‌స్తాయి. దీని కోసం సమంత విదేశాలకు వెళ్తుంది.

Advertisement

Also Read : “కాంతార” సినిమాలో ఈ మిస్టేక్ ను గమనించారా….? మీకూ అదే డౌట్ వచ్చిందా…?

ఆ మెడిసిన్ పొందే వరకు జరిగిన ఈ ప్రయాణంలో ఆమె ఎదుర్కొన్న సమస్యలేంటి అనేదే యశోద సినిమా అని టాక్ వినిపిస్తుంది. గతంలో సమంత తన చర్మ సమస్యల చికిత్స కోసం విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రంలో కూడా అలాంటిదే ఉండటంతో యశోద సినిమాను సామ్ నిజ జీవితానికి పోల్చుతున్నారు. మరి ఈ కథ నిజమో కాదో తెలియాలంటే వచ్చే న‌వంబ‌ర్‌ 11 వరకు వేచి చూడాల్సిందే.

Also Read : ‘స‌ర్దార్’ సినిమాలో కార్తీ 15 గెట‌ప్‌ల‌లో క‌నిపిస్తాడా ? ఇది నిజ‌మేనా ?

 

Visitors Are Also Reading