Home » “కాంతార” సినిమాలో ఈ మిస్టేక్ ను గమనించారా….? మీకూ అదే డౌట్ వచ్చిందా…?

“కాంతార” సినిమాలో ఈ మిస్టేక్ ను గమనించారా….? మీకూ అదే డౌట్ వచ్చిందా…?

by AJAY
Ad

ప్రస్తుతం థియేటర్ల పరిస్థితి దారుణంగా ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు వచ్చిన రేంజ్ లో సినిమాలకు కలెక్షన్లు రావడం లేదు. అదే విధంగా ఏ సినిమా అయినా ఎక్కువ రోజులు థియేటర్లలో ఆడటం లేదు. కానీ కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. అయితే భారీ బడ్జెట్ సినిమాలు భారీ వీఎఫ్ఎక్స్ తో తెరకెక్కించే సినిమాలు మాత్రమే ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి అనే ఒక అపోహ ఉండేది.

Advertisement

కానీ అది నిజం కాదంటూ ప్రూవ్ చేసిన సినిమా కాంతారా. కన్నడలో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతారా సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమాపై మన స్టార్స్ ప్రశంసలు కురిపించడంతో అందరూ ఒక్కసారిగా ఈ సినిమా వైపు చూశారు. ఇక ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా టాలీవుడ్ లోనూ బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.

Advertisement

కేవలం 16 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది. అంతేకాకుండా ఈ సినిమా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభవాన్ని ఇస్తోంది. సినిమాలో నటినటుల పర్ఫామెన్స్, కథ సూపర్ గా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ బ్లాక్ బస్టర్ సినిమాలో ఒక్క లాజిక్ మాత్రం చాలా మంది ప్రేక్షకులకు అర్థం కావడం లేదు. కాంతారా సినిమాలో హీరో, అతడి తండ్రి కోలం కట్టిన తర్వాత మాయమవుతారు అన్న సంగతి తెలిసిందే. నిజానికి ప్రతి ఏడాది హీరో వంశంలో ఎవరో ఒకరు కోలం కట్టడం ఆచారం. అయితే హీరో తండ్రి చాలాసార్లు కోలం కట్టినప్పటికీ ఓసారి అడవిలోకి పరిగెత్తుకుంటూ వెళ్లి తిరిగి రాడు.

ఆ తర్వాత గురువా అంటే హీరో తమ్ముడు కోలం కడతాడు. గురువా కూడా కోలం చాలా సార్లు కట్టినప్పటికి మాయం అవ్వడు. ఇక చివరకు గురువా మరణించిన తర్వాత హీరో కోలం కడతాడు. మళ్లీ క్లైమాక్స్ లో హీరో మాయం అవుతాడు. దాంతో గురువా ఎందుకు మాయమవ్వలేదు…? హీరో తండ్రి కూడా మొదట ఎందుకు మాయం అవ్వలేదు..? మళ్ళీ హీరో ఎందుకు మాయమయ్యాడు. అన్నది మాత్రం సినిమాలో చూపించలేదు. ఈ సీన్ లో లాజిక్ ఏంటి అన్నది చాలామందికి అర్థం కావడం లేదు. మరి దీనిపై డైరక్టర్ క్లారిటీ ఇస్తాడా లేదా అన్నది చూడాలి.

 

Also read : తెలుగులో గొప్ప హీరోయిన్ కానీ కన్నడలో సౌందర్య ఎందుకు ఫెయిల్ అయ్యారు ?

Visitors Are Also Reading