Home » టీమిండియాకి ఎదురు దెబ్బ.. టీ-20 వరల్డ్ కప్ కి షమీ దూరం..!

టీమిండియాకి ఎదురు దెబ్బ.. టీ-20 వరల్డ్ కప్ కి షమీ దూరం..!

by Anji
Ad

టీమిండియా బౌలర్ షమీ మొన్న వరల్డ్ కప్ లో బౌలింగ్ లో నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. అయితే టీ 20 వరల్డ్ కప్ కి షమీ లేకపోవడం టీమిండియాకి పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. 2024 టీ20 ప్రపంచకప్‌లో మహ్మద్ షమీ పాల్గొనడం కాస్త అనుమానంగానే ఉంది. ఇప్పటికే ఐపీఎల్ 2024 నుంచి తప్పుకున్న షమీ.. ప్రస్తుతం చీలమండ శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్నాడు.  వచ్చే టీ20 ప్రపంచకప్‌కు అతడు దూరంగా ఉంటాడని భావిస్తున్నారు.

Advertisement

2024 టీ 20 ప్రపంచకప్ వరకు మహ్మద్ షమీ కోలుకోవడం కాస్త అనుమానంగానే ఉంది.  తన ఎడమ చీలమండ గాయం కారణంగా మొత్తం IPL 2024 సీజన్‌కు దూరమయ్యాడు. వెస్టిండీస్‌లో జరిగే 2024 T20 ప్రపంచ కప్‌ను కూడా క్రికెటర్ కోల్పోయే అవకాశం ఉంది.  భారతదేశంలో జరిగే IPL 2024 ముగిసిన తర్వాత దాదాపు ఒక వారం తర్వాత ప్రారంభమవుతుంది T20 ప్రపంచ కప్‌.  టీమిండియాలో జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ కీలక బౌలర్లుగా టీమిండియాలో రాణిస్తున్నారు. టీ-20 ప్రపంచ కప్ లో వీరు ముగ్గురు త్రిశూలంలా బౌలింగ్ చేస్తారనుకున్న అభిమానులకు కాస్త నిరాశనే మిగిలింది. ప్రపంచ కప్ లో టీమిండియాలో తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ తో తలపడనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే భారత్-పాక్ మ్యాచ్ జూన్ 09న న్యూయార్క్ లో జరుగనుంది.

Advertisement

ఇదిలా ఉంటే.. మహ్మద్ షమీ ఆస్ట్రేలియా, అప్గానిస్తాన్ లతో భారత్ స్వదేశంలో జరిగిన T-20 సిరీస్ తో పాటు ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లకు దూరమయ్యాడు. అదేవిధంగా  ఆస్ట్రేలియాలో జరగబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 ద్వారా క్రికెట్‌లోకి తిరిగి రావాలని షమీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు అనేక ఉద్భవిస్తున్న నివేదికలు సూచిస్తున్నాయి. ప్రస్తుతానికి, భారత జట్టు ఈ ఏడాది డిసెంబర్ నుండి ప్రస్తుత WTC విజేత ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడేందుకు సిద్ధంగా ఉంది.  షమీ అప్పుడు ఎంట్రీ ఇస్తాడో లేదో వేచి చూడాలి మరీ.

Also Read : గిల్ తో అండర్సన్‌ గొడవ.. సిక్స్ వీడియో వైరల్!

Visitors Are Also Reading