Home » పాక్ సెలక్షన్ పై విమర్శలు..!

పాక్ సెలక్షన్ పై విమర్శలు..!

by Azhar
Ad

ఆస్ట్రేలియాలో ప్రారంభం కాబోతున్న టీ20 ప్రపంచ కప్ కోసం పాకిస్థాన్ ఈరోజు తమ జట్టును ప్రకటించింది. ఇక ఈ జట్టును చుసిన తర్వాత పాక్ ఆటగాడు షోయబ్ మాలిక్ కొన్ని రోజుల క్రితం చేసిన ట్విట్ వైరల్ గా మారింది. అయితే షోయబ్ మాలిక్ కు తాజాగా ముగిసిన ఆసియా కప్ తో పాటుగా.. ఇప్పుడు ప్రకటించిన టీ20 ప్రపంచ కప్ జట్టులో కూడా చోటు అనేది దక్కలేదు.

Advertisement

ఇక ఆసియా కప్ లో శ్రీలంక చేతిలో పాకిస్థాన్ ఓడిన తర్వాత షోయబ్ మాలిక్ ట్విట్టర్ లో.. కెప్టెన్ కు నచ్చినవాళ్లను.. స్నేహితులను ఎంపిక చేస్తున్నారు.. నచ్చని వాళ్ళను ఎంపిక చేయడం లేదు. అయిన మంచివారికి ఆ దేవుడు అండగా ఉంటాడు అంటూ ట్విట్ చేసాడు. అందులో పాకిస్థాన్ జట్టు పేరు అనేది చెప్పకపోయినా షోయబ్ మాలిక్ పాకిస్థాన్ బోర్డును అన్నాడు అనే విషయం అందరికి అర్ధం అవుతుంది.

Advertisement

అయితే ఈరోజు ప్రపంచ కప్ జట్టు అనేది వచ్చినా తర్వాత షోయబ్ మాలిక్ ట్విట్ పై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ స్పందించాడు. ఎప్పుడైనా జట్టును సెలక్ట్ చేసేది ఒక్కడు కాదు.. దానికి ఒక్క టీం ఉంటుంది. ఇక ఈ స్నేహం అనేది అంతటా ఉంటుంది. కావాల్సిన వారిని ఎంపిక చేయడం.. నచ్చని వారిని ఎంపిక చేయకపోవడం అనేది జరుగుతుంది. అందుకే పాక్ జట్టు ఎంపికపై విమర్శలు వస్తున్నాయి.. వస్తూనే ఉంటాయి కూడా అని పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

బీసీసీఐకి బుద్ధి చెప్పే పనిలో సంజూ ఫ్యాన్స్..!

ఆర్‌సీబీ వల్లే నేను ఈ ఘనత సాధించాను..!

Visitors Are Also Reading