Home » విజయ్-పరశురామ్ మూవీలో మృణాల్ క్యారెక్టర్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

విజయ్-పరశురామ్ మూవీలో మృణాల్ క్యారెక్టర్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

by Anji
Ad

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ జంటగా ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నాడు. టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైనటువంటి దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభించి 2024 సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీకి ‘కుటుంబరావ్’ అనే టైటిల్ పరిశీలించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ మృణాల్ క్యారెక్టర్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

Advertisement

అది ఏంటంటే.. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ దర్శకత్వం పాత్రలో నటించనుందట. హీరో విజయ్ అమెరికా కలలు అనే నిరుద్యోగి పాత్రలో కనిపించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. లైగర్ మూవీతో ఘోర డిజాస్టర్ అందుకున్న విజయ్ ప్రస్తుతం సమంతతో కలిసి ఖుషి మూవీలో నటిస్తున్నాడట. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 01న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా.. పరశురామ్ తో చేయబోయే మూవీ షూటింగ్ ఆగస్టు లేదా సెప్టెంబర్ లో ప్రారంభం చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ మూవీ ద్వారా మరో గీతగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ అందుకోవాలని విజయ్ భావిస్తున్నాడట. 

Advertisement

దర్శకుడు పరశురామ్ కి పలువురు నిర్మాతలతో అడ్వాన్స్ కి సంబంధించిన వివాదం నెలకొన్న సమయంలో విజయ్ సినిమా దాదాపు క్యాన్సిల్ అయినట్టేనని అందరూ  భావించారు. కానీ నిర్మాత దిల్ రాజు దగ్గర ఉండి ఆ సమస్యను సాల్వ్ చేసి ఈ మూవీ స్టార్ట్ చేయడం ఒక రకంగా పరాశురామ్ కి లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి. ఈ ఛాన్స్ ని సద్వినియోగం చేసుకొని పరశురామ్ విజయ్ కి బ్లాక్ బస్టర్ ఇస్తాడా లేదా అనేది వేచి చూడాలి మరి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

స్వాతంత్రం అంటే ఎవరో ఇచ్చే కాదు.. లాక్కునేది.. ఆసక్తి రేపుతున్న స్పై మూవీ ట్రైలర్

విజయ్ దేవరకొండ ‘ఖుషి’ ఓటీటీ ఫార్ట్ నర్ లాక్.. అన్ని కోట్లకు అమెజాన్ సొంతం చేసుకుందా ?

Visitors Are Also Reading