Home » స్వాతంత్రం అంటే ఎవరో ఇచ్చే కాదు.. లాక్కునేది.. ఆసక్తి రేపుతున్న స్పై మూవీ ట్రైలర్

స్వాతంత్రం అంటే ఎవరో ఇచ్చే కాదు.. లాక్కునేది.. ఆసక్తి రేపుతున్న స్పై మూవీ ట్రైలర్

by Anji
Ad

సాధారణంగా స్టార్ హీరోలు పాన్ ఇండియా సినిమాని తెరకెక్కించడానికి ఎన్నో కష్టాలు పడుతుంటే.. యంగ్ హీరో నిఖిల్ మాత్రం వరుసగా పాన్ ఇండియా సినిమాలను చేస్తూ వస్తున్నాడు. తాజాగా నిఖిల్ స్పై యాక్షన్ థ్రిల్లర్ విడుదలకి సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్ లో ఈ మూవీ కథ.. సుభాస్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న రహస్యాల చుట్టూ సాగనుందని తెలియజేసి ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ చేసాడు. 

Advertisement

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని ఈవెంట్ పెట్టి గ్రాండ్ గా విడుదల చేశారు. ఈ ఈవెంట్ ని హైదరాబాద్ AAA సినిమాస్ లో నిర్వహించారు. హీరో, హీరోయిన్లతో పాటు మూవీ టీమ్ కూడా పాల్గొంది. ఈ ట్రైలర్ విషయానికొస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కి ఈ సినిమా మంచి ట్రీట్ ఇవ్వబోతుందని తెలుస్తోంది.  ఈ సినిమాలో రానా దగ్గుబాటి ఓ గెస్ట్ రోల్ కనిపించబోతున్నాడు. ట్రైలర్ ఎండ్ లో రానా.. స్వాతంత్రం అంటే ఎవరో ఇచ్చేది లాక్కునేది. ఇది నేను చెప్పింది కాదు.. నేతాజీ చెప్పింది” అన్న డైలాగ్ హైలెట్ అని చెప్పాలి.

Advertisement

“చరిత్ర ఎప్పుడు మనకు నిజం చెప్పదు.. దాస్తుంది. దానికి సమాధానం మనమే వెతకాలి”  అంటూ మొదలైన ట్రైలర్ మూవీపై ఆసక్తి పెంచేస్తోంది. ఈ మూవీని సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి అనే ఆధారంగా తెరకెక్కించారు. ఇండియా బిగ్గెస్ట్ సీక్రెట్ అంటూ చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది. ఈ సినిమాతో ఎడిటర్ గ్యారీ బి హెచ్ దర్శకునిగా పరిచయమవుతున్నాడు. క్షణం, గూఢచారి, ఎవరు, హిట్ సిరీస్ వంటి సస్పెన్స్ సినిమాలకు ఎడిటర్ గా పని చేశాడు గ్యారీ బి హెచ్. శ్రీచరణ్ పకల ఈ సినిమాకి సంగీతానని సమకూర్చాడు. నిఖిల్ తో స్టంట్స్ చేసేందుకు తమిళ్ పొన్ను ఐశ్వర్య మీనన్ రంగంలోకి దిగింది. కార్తీకేయ 2 పాన్ ఇండియా బాక్సాఫీస్ సంచలనం సృష్టించిన నిఖిల్ ఈ సినిమాతో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో వేచి  చూడాలి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

విజయ్ దేవరకొండ ‘ఖుషి’ ఓటీటీ ఫార్ట్ నర్ లాక్.. అన్ని కోట్లకు అమెజాన్ సొంతం చేసుకుందా ?

రవితేజ అంత చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నారా? పెళ్లి నాటికి ఆమె వయస్సు ఎంతంటే.. ?

Visitors Are Also Reading