Home » విజయ్ దేవరకొండ ‘ఖుషి’ ఓటీటీ ఫార్ట్ నర్ లాక్.. అన్ని కోట్లకు అమెజాన్ సొంతం చేసుకుందా ?

విజయ్ దేవరకొండ ‘ఖుషి’ ఓటీటీ ఫార్ట్ నర్ లాక్.. అన్ని కోట్లకు అమెజాన్ సొంతం చేసుకుందా ?

by Anji
Ad

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. అయితే ఈ హీరో ఇప్పుడు ఒక్క హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈయన వరుసగా రెండు సినిమాలు ఫ్లాప్స్ అందుకున్నాడు. ప్రధానంగా భారీ అంచనాల మధ్య విడుదలైన లైగర్ మూవీ దారుణంగా నిరాశ పరిచింది.  ఈయన ఇప్పుడు చేస్తున్న మూవీస్ మీదనే ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖుషి  మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. 

Advertisement

ఈ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సౌత్ స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీకి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తాడు ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో విజయ్, సమంత ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఫస్ట్ సింగిల్ చార్ట్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇప్పుడు మరో అప్డేట్ వైరల్ అవుతోంది. ఈ మూవీ ఓటీటీ డీల్ లాక్ అయినట్టు సమాచారం. 

Advertisement

భారీగానే డీల్ కుదిరినట్టు టాక్ వినిపిస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ మూవీ ఓటీటీ డీల్ ని ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. అన్ని భాషల హక్కులను కలిపి అమెజాన్ రూ.30కోట్లకు పైగా డీల్ కుదుర్చుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో డీల్ కుదిరించుకోవడం నిజమో కాదో తెలియదు. కానీ ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఖుషీ మూవీ సెప్టెంబర్ 01న విడుదల కానున్నట్టు ఇటీవలే ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ మ్యూజిక్ అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీగానే పాన్ ఇండియా లెవల్ లో నిర్మిస్తున్నారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ లో అరుదైన సంఘటన..భర్త లేకుండా నిహారిక, భార్య లేకుండా పవన్ ?

మెగాస్టార్ ఫ్యామిలీతో పెట్టుకుని ఇండస్ట్రీలో అవకాశాలు కోల్పోయిన నటులు ఎవరంటే…!

Visitors Are Also Reading