Home » రహస్యంగా పెళ్లి చేసుకున్న హైపర్ ఆది..? వధువు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

రహస్యంగా పెళ్లి చేసుకున్న హైపర్ ఆది..? వధువు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

by Anji
Ad

జబర్దస్త్ షోతో ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్న  హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.  ఈ యంగ్ కమెడియన్ సుదీర్ఘకాలంగా తనదైన కామెడీతో సందడి చేస్తూ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ని అందిస్తున్నాడు. ఇక  అదే సమయంలో వరుసగా ఆపర్లను సొంతం చేసుకుంటూ సినీ పరిశ్రమలో కూడా దూసుకెళ్తున్నాడు. ఓ వైపు సినిమాలు, మరోవైపు పలు కామెడీ షోలలో కనిపిస్తూ రెండు చేతులా డబ్బులు సంపాదిస్తున్న హైపర్ ఆది ఒక్కో స్కిట్ కి ఎన్ని లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటాడనేది సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు పలువురు చర్చించుకోవడం విశేషం. 

Manam News

Advertisement

జబర్దస్త్ తో ఫుల్ పాపులారిటీ  సంపాదించుకున్న హైపర్ ఆది.. ఈ మధ్య కొద్ది రోజుల పాటు జబర్దస్త్ కి దూరమయ్యాడు. ఆది దూరంగా ఉన్న సమయంలో జబర్దస్త్ రేటింగ్ పై తీవ్ర ప్రభావం చూపించడంతో ఇటీవల ఆది మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం మల్లెమాల ప్రొడక్షన్ లో రూపొందుతున్న జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలో తనదైన స్టైల్ లో కామెడీ పంచ్ లతో అలరిస్తున్నారు. ఆయన స్కిట్స్ యూట్యూబ్ లో  కూడా భారీ వ్యూస్ రాబడుతున్నాయి. గత కొద్ది రోజులుగా హైపర్ ఆది పెళ్లికి సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ సృష్టిస్తున్నాయి. తాజాగా హైపర్ ఆది పెళ్లి ఫోటోలు సడన్ గా దర్శనమిచ్చాయి. సోషల్ మీడియాలో పెళ్లి పీటలపై ఉన్న ఓ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. హైపర్ ఆదికి రహస్యంగా పెళ్లి జరిగిందని ప్రచారం చేస్తున్నారు. అసలు ఇందులో వాస్తవం ఎంత ఉందనేది తెలుసుకోవడానికి మనం ప్రయత్నించగా.. ఓ సినిమా సన్నివేశంలో భాగంగా హైపర్ ఆది పెళ్లి కొడుకుగా తయారయ్యారని సమాచారం.  

Advertisement

Also Read :  చివరి రోజుల్లో సావిత్రి ఇల్లు, ఆస్తులను ఎందుకు అమ్మేయాల్సి వచ్చిందంటే..?

Hyper Adi

హైపర్ ఆదితో పాటు ఉన్న ఆ పెళ్లి కూతురు సీరియల్ యాక్టర్ అని సమాచారం. గతంలో కూడా ఈ ఫోటోలను బయటికి తీసి హైపర్ ఆదికి పెళ్లి జరిగిందని ప్రచారం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫోటోలలో వాస్తవం ఏమి లేదని హైపర్ ఆది సన్నిహితులు చెబుతున్నారు. తనదైన కామెడీతో బుల్లితెరపై తిరుగులేని కమెడీయన్ గా వెలుగొందుతున్నారు. సినిమాల్లోకి కూడా అడుగు పెట్టేశాడు. ఇప్పటికే చాలా సినిమాల్లో హీరో ఫ్రెండ్ పాత్రల్లో నటించాడు. అదేవిధంగా ఆటగదరా శివ అనే సినిమాలో లీడ్ రోల్ లో నటించాడు ఆది. అల్లరి నరేష్ మేడ మీద అబ్బాయి అనే సినిమాకు సంభాషణలు అందించి డైలాగ్ రైటర్ గా వర్క్ చేసి తన సత్తా  ఏంటో నిరూపించుకున్న  విషయం తెలిసినదే. 

Also Read :  మ‌సూద సినిమాలో దెయ్యం పాత్ర‌లో న‌టించిన న‌టి ఎవ‌రో తెలుసా..? ఆమె బ్యాగ్రౌండ్ ఇదే..!

Visitors Are Also Reading