Home » మ‌సూద సినిమాలో దెయ్యం పాత్ర‌లో న‌టించిన న‌టి ఎవ‌రో తెలుసా..? ఆమె బ్యాగ్రౌండ్ ఇదే..!

మ‌సూద సినిమాలో దెయ్యం పాత్ర‌లో న‌టించిన న‌టి ఎవ‌రో తెలుసా..? ఆమె బ్యాగ్రౌండ్ ఇదే..!

by AJAY
Published: Last Updated on
Ad

చిన్న సినిమాగా విడుదలై పెద్ద సక్సెస్ ను అందుకున్న సినిమా మసూద‌. హర్రర్ క్రైమ్ త్రిల్లర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు థియేటర్లలో నిజంగానే భయపడిపోయారు. అయితే ఈ సినిమా లో చెప్పుకోదగ్గ పాత్ర మసూద…. అదే టైటిల్ రోల్ కూడా. అయితే ఏ సినిమాలో అయినా టైటిల్ రోల్ చేసిన పాత్ర‌ను కచ్చితంగా చూపిస్తారు. కానీ ఈ సినిమాలో మసూద పాత్రను పోషించిన యువతి ముఖం సినిమాలో అసలు కనిపించదు.

Also Read: అల్లు అరవింద్ లేకుంటే చిరంజీవి లేడు.. షాకింగ్ కామెంట్స్ చేసిన చంద్రమోహన్..!!

Advertisement

 

మొదటి నుండి చివరి వరకు ఆ పాత్ర బుర‌కాలోనే కనిపిస్తుంది. అయితే ఆ బురకా వెనక ఉన్నది ఎవరు అన్న ప్రశ్న ప్రేక్షకుల్లో చాలామందిలో ఉంది. సినిమా పూర్తిగా చూసినప్పటికీ ఆ బురకా వెనకాల ఉండేది ఎవరో మాత్రం తెలియదు. కాగా ఈ సినిమాలో మసుదా పాత్రలో నటించిన నటి సినిమా థాంక్యూ మీట్ లో హాజరైంది. తన పేరు అఖిల అని మసుదా పాత్ర చేసిన యువ‌తి పరిచయం చేసుకుంది. అంతేకాకుండా ఈ సినిమాలో మసూద ఆత్మ వహించిన యువతిగా బాంధవ్య శ్రీధర్ నటించింది.

Advertisement

ఆమెకు తెలుగులో ఇదే మొదటి సినిమా… ఇక ఈ సినిమాలో ఆమె నటన చూసిన ప్రేక్షకులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే మసుదా సినిమాకు సాయికిరణ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని రాహుల్ యాదవ్ నక్క నిర్మించారు. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో తిరుపుర్ మరియు హీరోయిన్ సంగీత నటించారు. అంతేకాకుండా శుభలేఖ సుధాకర్ సైతం ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలో నటించారు. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతున్న‌ ఈ సినిమా త్వరలోనే ఓటిటిలో విడుదల కాబోతుంది.

Also Read:  సూప‌ర్ స్టార్ కృష్ణ‌ను ట్రెండ్ సెట్ట‌ర్ అని ఎందుకంటారు..? 10 కార‌ణాలు ఇవే..!

Visitors Are Also Reading