Home » చీర్ గర్ల్స్ ను టార్చర్ పెడుతున్న బీసీసీఐ…!

చీర్ గర్ల్స్ ను టార్చర్ పెడుతున్న బీసీసీఐ…!

by Bunty
Ad

ఐపీఎల్ 2023లో సన్రైజర్స్ హైదరాబాద్ కు మరో షాక్ తగిలింది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా గెలిచింది. సన్రైజర్స్ ను చిత్తుగా ఓడించి, ఈ ఏడాది ప్లే ఆఫ్స్ చేరుకున్న తొలి జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్ లో కూడా హెన్రిక్ క్లాసెన్ ఒంటరి పోరాటం చేశాడు. అతనికి భువనేశ్వర్ కుమార్ మంచి సహకారం అందించారు.

Advertisement

అయితే మిగతా బ్యాటర్లు అందరూ కట్టకట్టుకొని చేతులెత్తేయడంతో ఫలితం మాత్రం ఈ జట్టుకు అనుకూలంగా రాలేదు. అయితే గుజరాత్ యువ ఓపెనర్ శుబ్ మన్ గిల్, సాయి సుదర్శన్ రాణించడంతో ఆ జట్టు 188 స్కోరు చేసింది. చేజింగ్ లో సన్రైజర్స్ కు సరైన ఆరంభం దక్కలేదు. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా గెలిచింది. ఇదే మ్యాచ్ లో సన్రైజర్స్ చీర్ గర్ల్ ఒక అమ్మాయికి చేయి విరిగింది.

Advertisement

దానికి సపోర్టుగా నెక్ హోల్డ్ బ్యాండ్ పెట్టుకుంది. దానితోనే డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోట్టకూటి కోసం పరాయి దేశం నుంచి చీర్ లీడర్స్ వస్తున్నారు. అంతమాత్రాన గాయాలైనా సరే వాళ్ళని డాన్స్ చేయమని చెప్పడం అవసరమా అని నెటిజన్స్, బీసీసీఐని ప్రశ్నిస్తున్నారు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Sunisith : ఉపాసన తో గోవాకు సునిశిత్…చితక్కొట్టిన మెగా ఫ్యాన్స్‌!

SPY Movie : నిఖిల్ స్పై టీజర్ రిలీజ్..దుమ్ములేసిపోయింది

IPL 2023 : ధోని ఆటోగ్రాఫ్‌ తీసుకున్న గవాస్కర్..ఫోటో వైరల్

Visitors Are Also Reading