Home » SPY Movie : నిఖిల్ స్పై టీజర్ రిలీజ్..దుమ్ములేసిపోయింది

SPY Movie : నిఖిల్ స్పై టీజర్ రిలీజ్..దుమ్ములేసిపోయింది

by Bunty
Ad

హీరో నిఖిల్ గురించి తెలియని వారుండరు. హ్యాపీడేస్ తో పాపులర్ అయిన హీరో నిఖిల్ ఇప్పుడు టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. ఇటీవలే కార్తికేయ 2, 18 పేజీస్ మూవీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కార్తికేయ 2 దేశవ్యాప్తంగా సంచలన విజయం నమోదు చేసింది. తాజాగా నిఖిల్ ఓ స్పై చిత్రంలో నటిస్తున్నాడు.

Advertisement

 

ప్రముఖ ఎడిటర్ గ్యారీ బి.హెచ్. దర్శకుడిగా పరిచయం అవుతూ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా న్యూఢిల్లీలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం… కర్తవ్యం మార్గం వద్ద ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. భగవాన్ జి ఫైల్స్ గురించి మకరంద్ దేశ్ పాండే తన టీంకు వివరించడంతో టీజర్ ప్రారంభమవుతుంది.

Advertisement

ఇది భారతదేశం యొక్క అత్యంత రహస్యమైన రహస్యం. ఆజాద్ హింద్ పౌజ్ సృష్టికర్త దూరదృష్టి కలిగిన వ్యక్తి మరియు ఒకే ఒక్క సుభాష్ చంద్రబోస్ గురించి. నేతాజీ విమాన ప్రమాదంలో మరణించడాన్ని ఆయన ఒక కవర్ అప్ స్టోరీగా అభివర్ణించారు. నిఖిల్ పోషించిన స్పై పాత్రకి మిస్టరీని ఛేదించే బాధ్యతను అప్పగించారు. తాజాగా విడుదలైన టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

చిరంజీవికే కండిషన్లు పెట్టిన శ్రీదేవి…ఆ తర్వాత దూలతీరింది…?

నాగ చైతన్యకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున ?

Sunisith : ఉపాసన తో గోవాకు సునిశిత్…చితక్కొట్టిన మెగా ఫ్యాన్స్‌!

Visitors Are Also Reading