Home » బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో స్టార్ హీరోయిన్ కి ఫోన్ చేసిన ప్రభాస్.. ఎందుకోసమంటే ? 

బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో స్టార్ హీరోయిన్ కి ఫోన్ చేసిన ప్రభాస్.. ఎందుకోసమంటే ? 

by Anji
Ad

నందమూరి బాలకృష్ణ గత రెండు సీజన్ల నుంచి బుల్లితెరపై దూసుకెళ్లుతున్న విషయం తెలిసిందే. ఆహాలోలో  వచ్చే అన్ స్టాపబుల్ షోతో తాను ఏంటో నిరూపించుకున్నాడు బాలయ్య. తనకు కూడా మాట్లాడే సత్తా ఉందని.. హోస్టింగ్ లో అదరగొట్టేస్తానని చెప్పకనే చెప్పేశాడు. ప్రస్తుతం అన్ స్టాపబుల్ షో రెండో సీజన్ నడుస్తోంది. తొలి సీజన్ సూపర్ డూపర్ హిట్ కావడంతో రెండో సీజన్ ఇటీవలే కొన్ని ఎపిసోడ్స్ ప్రసారమైన విషయం తెలిసిందే. తాజాగా అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కి పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ని తీసుకొస్తున్నాడు బాలయ్య.  

Also Read :  రీసెంట్ గా విడుదలైన 8 ఓటీటీ సినిమాలు, తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్ ఇవే..!

Advertisement

సీజన్ 2 తొలి ఎపిసోడ్ కే చంద్రబాబు, లోకేశ్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత వచ్చిన  నాలుగు ఎపిసోడ్స్ హిట్ సాధించాయి. తాజాగా 6వ ఎపిసోడ్ కి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో పాటు మ్యాచ్ స్టార్ గోపిచందర్ ఇన్వైట్ చేసాడు బాలయ్య. ప్రభాస్, గోపిచంద్ లతో బాలయ్య ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ ఇటీవలే పూర్తయిందట. అందుకు సంబందించిన ఓ ప్రోమోను కూడా విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ కి ప్రభాస్ తో పాటు గోపిచంద్ ను బాలయ్య ఎందుకు ఇన్వైట్ చేశారో తెలియాలంటే ఆ షో ప్రసారమయ్యే దాకా ఎదురుచూడాల్సిందే. 

Advertisement

Also Read :  జయం సినిమాలో సదా చెల్లెలిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా…? ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా..!

Manam News

ఈ ఎపిసోడ్ నూతన సంవత్సరం కానుకగా డిసెంబర్ 31న ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్ లో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కి బాలయ్య ఫోన్ చేసి ప్రభాస్ కి ఇస్తాడట. దీంతో ప్రభాస్ తనదైన స్టైల్ లో డైలాగ్ లతో శృతిని ఓఆట పట్టిస్తాడట. ఈ ఎపిసోడ్ కి శృతితో ప్రభాస్ డైలాగ్ లే హైలెట్ అని తెలుస్తోంది. ప్రస్తుతం శృతిహాసన్ బాలయ్యతో వీరసింహారెడ్డి సినిమాలో నటిస్తోంది. ప్రభాస్ తో సలార్ సినిమాలో కూడా నటిస్తుంది. వీరిద్దరూ కలిసి శృతిని అలా ఆటపట్టించినట్టు తెలుస్తోంది. 

Also Read :  పవన్‌ కళ్యాణ్‌ వాహనానికి “వారాహి” పేరు ఎందుకు పెట్టారు.. అసలు దాని వెనుక ఉన్న రహస్యం ఏంటీ ?

Visitors Are Also Reading