Telugu News » Blog » ప్ర‌పంచంలోనే అతిపెద్ద సిమెంట్ త‌యారీ కంపెనీ భార‌త్‌కు గుడ్ బై.. కార‌ణం ఏమిటంటే..?

ప్ర‌పంచంలోనే అతిపెద్ద సిమెంట్ త‌యారీ కంపెనీ భార‌త్‌కు గుడ్ బై.. కార‌ణం ఏమిటంటే..?

by Anji
Ads

ప్ర‌పంచంలోని అతిపెద్ద సిమెంట్ త‌యారీ కంపెనీ హోల్సిమ్ గ్రూప్ భార‌త్‌కు గుడ్ బై చెప్పే యోచ‌న‌లో ఉన్న‌ది. కంపెనీ గ్లోబ‌ల్ స్ట్రాట‌జీలో భాగంగా భార‌త్ నుంచి త‌మ వ్యాపారాల‌కు స్వ‌స్తీ ప‌లుకుతూ కోర్ మార్కెట్ల పై హోల్సిమ్ గ్రూప్ దృష్టి సారించినున్న‌ట్టు ప‌లు నివేదిక‌లు వెల్ల‌డిస్తున్నాయి. గ‌త ప‌దిహేడేళ్లుగా హోల్సిమ్ గ్రూప్ భార‌త్ మార్కెట్‌ల‌లో త‌మ వ్యాపారాల‌ను నిర్వ‌హిస్తుంది. అదేవిధంగా ఆ కంపెనీ రెండు లిస్టెడ్ కంపెనీలోని వాటాల‌ను కూడా విక్ర‌యించేందుకు సిద్ధం ఉన్న‌ట్టు స‌మాచారం.

Advertisement

స్విట్జ‌ర్లాండ్‌కు చెందిన హోల్సిమ్ గ్రూప్ అంబుజా సిమెంట్, ఏసీసీ సిమెంట్ కంపెనీల‌లో వాటాల‌ను క‌లిగి ఉంది. అంబుజా సిమెంట్‌లో 63.19 శాతం, ఏసీసీ కంపెనీలో 4.48 శాతం వాటాల‌ను ఈ సంస్థ క‌లిగి ఉన్న‌ది. హోల్సిమ్ గ్రూప్ తీసుకున్న ఈ నిర్ణ‌యంతో సిమెంట్ ప‌రిశ్ర‌మ‌పై ప్ర‌భావం చూపే అవ‌కాశమున్న‌ట్టు ప‌లు రంగాల నిపుణులు అభిప్రాయప‌డుతున్నారు. ఇరు కంపెనీల వాటాల‌ను అదానీ గ్రూప్స్‌, జెఎస్‌డ‌బ్ల్యూ సిమెంట్ ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. కొనుగోలు ద్వారా పోర్ట్ ఫోలియోను డైవ‌ర్సిఫైడ్ చేసుకోవాల‌ని కూడా భావిస్తోంది. గ‌త ఏడాది సెప్టెంబ‌ర్ నెల‌లో హోల్సిమ్ గ్రూప్ త‌న బ్రెజిలియ‌న్ యూనిట్‌ను సుమారు ఒక బిలియ‌న్ డాల‌ర్ల‌కు విక్ర‌యించిన‌ది. భార‌త్‌తో పాటు జింబాబ్వేలో వ్యాపారాల‌ను విక్ర‌యించేందుకు సిద్ధ‌మైంది.

Advertisement

Advertisement

హోల్సిమ్ గ్రూప్ ఆయా దేశాల నుంచి నిష్క్ర‌మించేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ది. స్పెషాలిటీ బిల్డింగ్ సొల్యూష‌న్స్‌, హై ఎండ్ ఎన‌ర్జీ ఎఫిసియెంట్ రెనోవేష‌న్స్ వంటి విభాగాల‌పై హోల్సిమ్ గ్రూప్ ఫోక‌స్ చేయ‌నున్న‌ది. స్ట్రాట‌జీ 2025 ఆక్స‌ల్రెటింగ్ గ్రీన్ గ్రోత్ ప్రోగ్రాంలో ఆయా దేశాల నుండి నిష్క్ర‌మించేందుకు హోల్సిమ్ గ్రూప్ నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఇదిలా ఉండ‌గా.. కంపెనీ డిసెంబ‌ర్ 2021 లో మ‌ల‌ర్కీ రూఫింగ్ ఉత్ప‌త్తుల‌ను 2021 ప్రారంభంలో ఫైర్‌స్టోన్ బిల్డింగ్ ఉత్ప‌త్తుల‌ను కొనుగోలు చేసిన‌ది.

ఇది కూడా చ‌ద‌వండి :

  1. Mega 154 : చిరంజీవి సినిమా టైటిల్ లీకు చేసిన శేఖ‌ర్ మాస్ట‌ర్‌..!
  2. Maria Sharapova : త‌ల్లికాబోతున్న మాజీ టెన్నిస్ క్రీడాకారిణి.. పుట్టిన‌రోజు నాడు ప్ర‌క‌ట‌న‌
  3. నవ గ్రహాలు మనకు అనుకూలించాలంటే ఏం చేయాలో తెలుసా…?