Home » Mega 154 : చిరంజీవి సినిమా టైటిల్ లీకు చేసిన శేఖ‌ర్ మాస్ట‌ర్‌..!

Mega 154 : చిరంజీవి సినిమా టైటిల్ లీకు చేసిన శేఖ‌ర్ మాస్ట‌ర్‌..!

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన త‌రువాత వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న విష‌యం తెలిసిన‌దే. ఇప్ప‌టికే ఆచార్య సినిమా విడుద‌ల‌కు సిద్ధం అవుతుండ‌గా.. మ‌రికొన్ని చిత్రాలు కూడా సెట్స్ పై షూటింగ్ జ‌రుపుకుంటున్నాయి. అందులో ముఖ్యంగా మెగా 154 ఒక‌టి.

Advertisement

బాబీ (కే.ఎస్‌.ర‌వీంద్ర‌) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రంలో చిరంజీవి స‌ర‌స‌న శృతిహాస‌న్ న‌టిస్తుండ‌గా.. మాస్ మ‌హారాజా ర‌వితేజ కూడా ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ చిత్రం యొక్క టైటిల్‌పై సోష‌ల్ మీడియాలో ప‌లు వార్త‌లు గుప్పుమంటున్నాయి. కొంద‌రేమో వాల్తేరు వీర‌య్య అని అంటుండ‌గా.. మ‌రికొంద‌రూ మాస్ మూల విరాట్ అని చెబుతున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా టైటిల్‌ని ఓ రేంజ్‌లో అనౌన్స్ చేయాల‌న మేక‌ర్స్ భావిస్తున్న త‌రుణంలో అనుకోకుండా ఈ సినిమా టైటిల్‌ను కొరియోగ్రాఫ‌ర్ శేఖ‌ర్ మాస్ట‌ర్ లీక్ చేశాడు.


ఇటీవ‌ల నిర్వ‌హించిన ఓ ఇంట‌ర్వ్యూలో శేఖ‌ర్ మాస్ట‌ర్ త‌న త‌దుపరి సినిమాల గురించి మాట్లాడుతూ.. ర‌వితేజ న‌టిస్తున్న ధ‌మాకా, రామారావు ఆన్‌డ్యూటీ సినిమాలు చేస్తున్నాను. త‌మిళంలో రెండు ప్రాజెక్ట్‌లు. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవితో భోళా శంక‌ర్‌, వాల్తేరు వీర‌య్య చిత్రాల‌ను చేస్తున్నాను అని నోరు జారాడు. అయితే ఇప్ప‌టివ‌ర‌కు వాల్తేరు వీర‌య్య అని అభిమానులు అనుకోవ‌డ‌మే కానీ ఎవ‌రు కూడా క‌న్ఫ‌ర్మ్ చేయ‌క‌పోవ‌డంతో స‌రికొత్త టైటిల్ వ‌స్తుందేమో అని అనుకుంటున్నారు అభిమానులు.

Advertisement

శేఖ‌ర్ మాస్ట‌ర్ క్లారిటీ ఇవ్వ‌డంతో మెగా 154 టైటిల్ వాల్తేరు వీర‌య్య అని కూడా ఫిక్స్ అవుతున్నారు ప‌లువురు అభిమానులు. మ‌రోవైపు మేక‌ర్స్ మాత్రం శేఖ‌ర్ మాస్ట‌ర్ పై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. స్పెష‌ల్ అకేష‌న్ రోజు టైటిల్ లుక్‌తో స‌హా విడుద‌ల చేద్దాం అనుకుంటే.. శేఖ‌ర్ మాస్ట‌ర్ నోరు జార‌డంతో స‌ర్‌ప్రైజ్ మిస్ అయింద‌ని మేక‌ర్స్ బాధ‌ప‌డుతున్నార‌ట‌. ఇక అధికారికంగా ఈ టైటిల్‌ను ఎప్పుడు విడుద‌ల చేస్తారో చూడాలి.

ఇది కూడా చ‌ద‌వండి : 

  1. Gruhalakshmi ఏప్రిల్ 20 (ఈరోజు) ఎపిసోడ్ : అమ్మ క‌న్నా ఫ్యూచ‌రే ముఖ్యం అంటున్న దివ్య.. డ‌స్ట్ బిన్ లో ప్రేమ్ పాట‌..!
  2. అతిగా నిద్రపోతున్నారా… అయితే ప్రమాదమే.. ఏంటో చూడండి..!!
  3. ఎన్టీఆర్ సినిమాకు భ‌య‌ప‌డి వాయిదా వేసుకున్న మెగాస్టార్ సినిమా..ఆ త‌ర్వాత రిజ‌ల్ట్ చూసి షాక్!
Visitors Are Also Reading