Home » ధోని, కోహ్లీలను నెత్తిన పెట్టుకోవడం ఫ్యాన్స్ ఆపాలి..!

ధోని, కోహ్లీలను నెత్తిన పెట్టుకోవడం ఫ్యాన్స్ ఆపాలి..!

by Azhar
Ad

భారత దేశంలో క్రికెట్ కు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో.. ఆ ఆటను ఆడే ఆటగాళ్లకు అంతకంటే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ప్రతి సారి జట్టులో ఉన్న అందరూ ఆటగాళ్లలో ఎవరికో ఒక్కరికే ఎక్కువ క్రేజ్.. ఫాలోయింగ్ అనేది ఉంటుంది. గతంలో ధోనికి ఉన్న క్రేజ్ అనేది ఇప్పుడు ఉన్న వారిలో కోహ్లీకి ఉన్న విషయం తెలిసిందే. వీరిని అభిమానులు నెత్తిన పెట్టుకొని మరి ఆరాధిస్తారు.

Advertisement

కానీ ఇండియాలో ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ అలా చేయడం ఆపేయాలి అని భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ కామెంట్స్ చేసాడు. ఫ్యాన్స్ ఇలా ఒక్క ఆటగాడికే ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల మిగితా ఆటగాళ్లు మరుగున పడుతున్నారు.. వాటి టాలెంట్ కు గుర్తింపు అనేది ఉండటం లేదు. ఇది మంచి విషయం కాదు అని అంటూ దానికి ఉదాహరణ కూడా ఇచ్చాడు.

Advertisement

ఆసియా కప్ లో కోహ్లీ సెంచరీ అనేది చేసిన తర్వాత దేశం మొత్తం సంబరాలు చేసుకుంది. కానీ అదే మ్యాచ్ లో నాలుగు ఓవర్ లలో నాలుగే పరుగులు ఇచ్చి.. 5 వికెట్లు తీసిన భువనేశ్వర్ కుమార్ ను ఎవరు పటించుకోలేదు. భువీ సాధించింది గొప్పది అని కూడా ఎవరికీ అనిపించలేదు. ఆ సమయంలో కేవలం నేను ఒక్కడినే భువీ గురించి మాట్లాడాను. కాబట్టి ఇప్పటికైనా ఇలా ఒక్కే ఆటగాడిని కాకుండా.. జట్టు మొత్తని అభిమానించండి అని గంభీర్ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

ఆ మహిళా క్రికెటర్ బౌలింగ్ ఎదుర్కోవడం చాలా కష్టం..!

ఆ పేపర్‌లో మీరు అనుకునేది లేదు.. ఏం ఉందొ తెలిస్తే అంతే..?

Visitors Are Also Reading