Home » ఆ పేపర్‌లో మీరు అనుకునేది లేదు.. ఏం ఉందొ తెలిస్తే అంతే..?

ఆ పేపర్‌లో మీరు అనుకునేది లేదు.. ఏం ఉందొ తెలిస్తే అంతే..?

by Azhar
Ad
ఐపీఎల్ 2022 సీజన్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ జట్టు అప్పటివరకు ఫామ్ లో లేని.. హార్దిక్ పాండ్యను కెప్టెన్ గా నియమించడం… అలాగే ఆశిష్ నెహ్రాను హెడ్ కోచ్ గా పెట్టుకోవడంతో ఈ జట్టు ఎలా ఆడుతుందో అనుకున్నారు. ఇక మెగవేలం తర్వాత అయితే ఈ జట్టు లాస్ట్ పొజిషన్ లో ఉంటుంది అని కామెంట్స్ చేసారు.
కానీ ఎవరు ముగించని విధంగా ఈ జట్టు ఐపీఎల్ 2022 టైటిల్ ను అందుకుంది. ఇక ఈ జట్టు విజయంలో అందర్నీ ఆశ్చర్యపరిచిన విషయం హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా ఒక్క పేపర్ తో ప్లాంస్ వేయడం అనేది. మిగితా జట్ల కోచ్లు కంప్యూటర్ల ముందు కుస్తీ పడుతుంటే.. నెహ్రా మాత్రం ఒక్కా పేపర్ పైన పెన్సిల్ తో ప్లాన్ వేసి టైటిల్ గెలిచాడు అని చాల మంది కామన్స్ చేసారు.
గుజరాత్ టైటిల్ గెలిచిన తర్వాత నెహ్రా పేపర్ తో ఉన్న ఫోటోలు వైరల్ గా మారాయి. అందులో అందరూ గేమ్ ప్లాన్ ఉంది అని అనుకున్నారు. కానీ తాజాగా నెహ్రా అందులో ఏం ఉందొ చెప్పాడు. దాంతో అందరూ షాక్ అవుతున్నారు. ఆ పేపర్ లో ఏదో గొప్పగా ఉంది అని అందరూ ఎందుకు అనుకుంటున్నారో నాకు తెలియదు… కానీ ఆ పేపర్ లో నేను ప్రాక్టీస్ తర్వాత ఏం తినాలో మెనూ సిద్ధం చేస్తున్నాను అని చెప్పాడు.

Advertisement

Visitors Are Also Reading