Telugu News » Blog » రొనాల్డో ఇంట్లో తీవ్ర విషాదం..!

రొనాల్డో ఇంట్లో తీవ్ర విషాదం..!

by Manohar Reddy Mano
Ads

ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆట ఫుట్ బాల్. అయితే ఈ ఫుట్ బాల్ మ్యాచ్ లు చూసేవారికి క్రిస్టియానో రొనాల్డో అంటే ఎవరో తెలియ కుండా ఉండదు. తాజాగా రొనాల్డో ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అతని భార్య జార్జినాకు ఓ కొడుకు పుట్టిన వెంటనే చనిపోయాడు. ఈ విషయాన్ని రొనాల్డోస్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు.

అందులో.. ‘పుట్టిన వెంటనే మా బాబు చనిపోయాడు. ఈ విషయం మీతో పంచుకుంటున్నందుకు చాలా బాధగా ఉంది. ఏ తల్లిదండ్రులకు అయినా ఇది భరించలేని విషాదం. ఇప్పుడు ఇంకో పాప బతికి ఉన్న విషయం ఒక్కటే మాకు కొంత ఆనందాన్ని ఇవ్వగలదు. ఇటువంటి కష్ట సమయంలో మా వెంట ఉన్న డాక్టర్లకు ధన్యవాదాలు. ఈ కష్ట సమయంలో మా వ్యక్తిగత ప్రైవేసికి భంగం కలిగించవద్దని కోరుతున్నాం’ అని రోనాల్డో పోస్ట్ చేసాడు.

అయితే రోనాల్డో-జార్జినా జంటకు నలుగురు పిల్లలు ఉన్నారు. కానీ గత ఏడాది వీరు మళ్ళీ తలిదండ్రులు కాబోతున్నట్లు.. తమకు కవలలు పుట్టబోతున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు పుట్టిన ఆ కవలలోనే ఒక్క బాబు మరణించాడు. రోనాల్డో ఎంత బిజీగా ఉన్న… సమయం దొరికిన ప్రతిసారి తన కుటుంబంతో గడుపుతాడు.

ఇవి కూడా చదవండి :

గత ఏడాది విన్నర్ ను ఓడించావ్.. టేబుల్ టాపర్ చేతిలోనే ఓడిపోయావ్…!

ఉమ్రాన్ పై కేటీఆర్ ప్రశంసలు..!


You may also like