Home » బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వకముందు ఏం జరిగిందో చెప్పిన ద్రావిడ్..!

బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వకముందు ఏం జరిగిందో చెప్పిన ద్రావిడ్..!

by Azhar
Ad

ఇంగ్లాండ్ లో ఇంగ్లాండ్ పై ప్రస్తుతం భారత జట్టు పై చెయ్యి సాధిస్తుంది. నిన్న ఈ రెండు జట్ల మధ్య ప్రారంభమైన 5వ టెస్ట్ మ్యాచ్ టీం ఇండియా ఇప్పటికైతే మంచి పొజిషన్ లో ఉంది అనే చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ లో మన భారత జట్టుకు పేసర్ బుమ్రా కెప్టెన్ గా వ్యవరిస్తున్నాడు. అసలు కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్ గా తేలడం వల్ల ఈ బాధ్యతలు బుమ్రా చేతికి వచ్చాయి. అందువల్ల భారత జట్టును టెస్టులో నడిపిస్తున్న మొదటి పేసర్ గా బుమ్రా నిలిచాడు. కానీ బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వడానికి ముందు ఏం జరిగింది అనే విషయాన్ని తాజాగా టీం ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ వివరించాడు.

Advertisement

ద్రావిడ్ మాట్లాడుతూ.. రోహిత్ కు వచ్చిన సమయం నుండి మ్యాచ్ కు అతను అందుబాటులో ఉంటాడో ఉండడో అనే అనుమానం అందరికి ఉంది. అందుకే మేము ముందుగానే బుమ్రాకు చెప్పం. ఒకవేళ రోహిత్ అందుబాటులోకి రాకపోతే నువ్వే టీం ఇండియా కెప్టెన్ గా వ్యవరించాలని. అయితే ఈ విషయం చెప్పిన తర్వాత.. నేను అతనికి చెప్పిన మొదటి విషయం టెన్షన్ తీసుకోకు అని.. ఎందుకంటే నువ్వు కెప్టెన్ గా కంటే బౌలర్ గానే జట్టుకు ముఖ్యం. అందుకు కారణం బుమ్రా ఓ బౌలర్ గా ప్రతి ఆటగాడిని చదవగలడు. అలాగే ఆటను అర్ధం చేసుకోగలడు.

Advertisement

కెప్టెన్ కు కావాల్సిన ముఖ్యమైన లక్షణాలు కూడా ఇవే. ఇక అతనికి జట్టు పైన… జట్టుకి అతని పైన గౌరవం ఉంది. అయితే కెప్టెన్సీ అనేది బుమ్రాకు కొత్త. అందువల్ల ఈ మ్యాచ్ లోనే అతను ఫీల్డింగ్ లో.. బౌలింగ్ ఛేంజింగ్ లో అద్భుతాలు చేయాలనీ మనం అనుకోకూడదు. ఓ బ్యాటర్ కంటే బౌలర్ జట్టుకు కెప్టెన్సీ చేయడం చాలా కష్టం. అతను ఒకే సమయంలో అటు జట్టును.. ఇటు బౌలింగ్ ను చూసుకోవాలి. అందుకే బుమ్రాకు నీ పనిని నువ్వు మరింత జాగ్రత్తగా చేయమని చెప్పను అని రాహుల్ ద్రావిడ్ పేర్కొన్నాడు. అయితే ఈ మ్యాచ్ లో ఇప్పటికే బుమ్రా 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి :

ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుపై దినేష్ ఫైర్.. ఎందుకంటే..?

చరిత్ర సృష్టించిన బుమ్రా..!

Visitors Are Also Reading