Home » చరిత్ర సృష్టించిన బుమ్రా..!

చరిత్ర సృష్టించిన బుమ్రా..!

by Azhar
Ad

భారత కెప్టెన్ బుమ్రా ఈరోజు ఓ కొత్త చరిత్ర సృష్టించాడు. సచిన్, లారా, కోహ్లీ వంటి దిగ్గజ ఆటగాళ్లకు కూడా సాధ్యం కానీ రికార్డును తన పేరిట లికించుకున్నాడు. అయితే ప్రస్తుతం టీం ఇండియా ఇంగ్లాండ్ జట్టుతో గత ఏడాది కరోనా కారణంగా వాయిదా పడిన టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే. నిన్న ప్రారంభమైన ఈ మ్యాచ్ లో టీం ఇండియా టాప్ ఆర్డర్ కూలిపోయిన సెంచరీతో రిషబ్ పంత్ నిలబెట్టాడు. ఇక ఈరోజు మ్యాచ్ ఆరంభమైన తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన జడేజా కూడా సెంచరీ చేసాడు. కానీ ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన బుమ్రా వీరిద్దరి సెంచరీల కంటే ఎక్కువ పేరును సంపాదించేసాడు.

Advertisement

బ్యాటింగ్ వచ్చిన బుమ్రాకు.. ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. అయితే ఆ ఓవర్ 4 గా మలిచాడు బుమ్రా. ఆ తర్వాత బంతి వైడ్ ఫోర్ గా వెళ్ళింది. ఇక ఆ వెంటనే ఓ నో బాల్ ను బౌండరీ బయటకు సిక్స్ గ మలిచాడు మన కెప్టెన్. ఇక ఆ తర్వాతి మూడు బంతులకు వరుసగా ఫోర్స్ తో హ్యాట్రిక్ కొట్టిన బుమ్రా.. నెక్స్ట్ బంతిని మళ్ళీ సిక్స్ గా బౌండరీ బయటకు పంపించాడు. ఇక ఆఖరి బంతి బ్రాడ్ యార్కర్ వేయగా అది సింగిల్ తీసాడు బుమ్రా. దాంతో ఈ ఒక్కే ఓవర్లో బుమ్రా 35 పరుగులను సాధించాడు. అందువల్ల టెట్ క్రికెట్ లో ఒక్కే ఓవర్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా బుమ్రా నిలిచాడు.

Advertisement

భుమ్మర కంటే ముందు బ్రియాన్ లారా (28) వద్ద ఈ రికార్డు ఉండేది. అయితే ఈ ఓవర్ తర్వాత బ్రాడ్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఎందుకంటే మన యువరాజ్ 2007 లో ఒక్కే ఓవర్ లో ఆరు సిక్సులు కొట్టింది ఇతని బౌలింగ్ లోనే. కాబట్టి అప్పుడు బ్రాడ్ ఎలాంటి ఎక్స్ప్రెషన్ అనేది పెట్టాడో ఇప్పుడు కూడా అచ్చం అలంటి ఏకప్రేషన్ పెట్టడంతో ఏంటి.. బుమ్రాలో యువి కనిపించాడా అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక బుమ్రా బ్యాటింగ్ చూస్తూ మన భారత ఆటగాళ్లు డ్రెసింగ్ రూమ్ లో చేసిన సందడి కూడా ఇప్పుడు నెట్టింట్లో చెక్కర్లు కొడుతుంది.

ఇవి కూడా చదవండి :

పుజారా @ది వరస్ట్ రికార్డ్..!

కోహ్లీ ఆడుతావా.. లేదా..?

Visitors Are Also Reading