Home » వేడినీటిలో అల్లం కలిపి తాగుతున్నారా..? అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోండి !

వేడినీటిలో అల్లం కలిపి తాగుతున్నారా..? అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోండి !

by Anji
Ad

గత మూడేళ్ల నుంచి కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజృంబించిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి నుంచి రక్షించుకొని ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ప్రధానంగా కరోనాతో పోరాడాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని వైద్యులు సూచించడంతో రకరకాలుగా ప్రయత్నం చేశారు ప్రజలు. ఈ నేపథ్యంలోనే వేడి నీటిలో అల్లం కలిపి తీసుకుంటున్నారు. అల్లం నీరు తీసుకోవడం వల్ల అల్లంలో ఉండే యాంటి ఇన్ ప్లేమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు మీ శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఇంకా అల్లం నీటితో మరెన్నో ప్రయోజనాలున్నాయి. 

Advertisement

 

విటమిన్ సి, మెగ్నీషియం ఎన్నో మినరల్స్ కలిగిన అల్లం శరీరానికి మేలు చేస్తుంది. చాలా మంది కీళ్ల నొప్పులు, ఇతర నొప్పులతో బాధపడుతుంారు. అయితే ఎలాంటి నొప్పులను అయినా తగ్గించే గుణం అల్లానికి ఉంది.అందుకే ప్రతిరోజూ అల్లం నీరు తాగితే నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.  అదేవిధంగా ప్రతిరోజూ అల్లంనీరు తాగితే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. అజీర్తితో బాధపడుతున్న వారు కూడా అల్లం రసాన్ని తాగితే ఉపశమనం కలుగుతుంది. అల్లంతో దగ్గు, జలుబు, గొంతు నొప్పి నుంచి త్వరగా కోలుకునేవిధంగా చేస్తాయి.

Advertisement

వాస్తవానికి అల్లం మంచిదే కానీ.. అల్లంపై పొట్టును తీయకుండా వినియోగిస్తే మాత్రం సమస్యలు తప్పవు అంటున్నారు నిపుణులు. చాలా మంది అల్లాన్ని వేడినీటిలో కలిపి తాగేటప్పుడు తొక్క తీయకుండా యూజ్ చేస్తారు. నిజానికి అల్లంపై తొక్కలో విష పదార్థాలుంటాయని.. ఆరోగ్యానికి హాని చేస్తాయని అంటున్నారు.  అల్లం తొక్క తీసి ఉపయోగించాలంటున్నారు. తొక్క తీయకుండా అల్లాన్ని మనం అలాగే వేసినట్టయితే మనకు ప్రమాదం పొంచి ఉంది అనే విషయాన్ని గుర్తించుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం అల్లం పొట్టును తీసేయండి.. ఆరోగ్యంగా ఉండండి. 

  మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

వెంకటేష్ – రాజమౌళి కాంబినేషన్ లో ఆగిపోయిన సినిమా ఏంటో తెలుసా ?

తినేముందు విస్తారాకు చుట్టూ నీళ్లు చల్లుతారు.. ఎందుకో తెలుసా ?

 

Visitors Are Also Reading