Home » తినేముందు విస్తారాకు చుట్టూ నీళ్లు చల్లుతారు.. ఎందుకో తెలుసా ?

తినేముందు విస్తారాకు చుట్టూ నీళ్లు చల్లుతారు.. ఎందుకో తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటుంటారు. అన్నం తినే ముందు అన్నం యొక్క విశిష్టతను తెలియజేసే శ్లోకం పఠిస్తారు. పాఠశాలలో చదువుకునే రోజుల్లో విద్యార్థులతో శ్లోకం చెప్పించేవారు. ఇప్పుడు ఈ పరిస్థితి మాత్రం అంతగా కనిపించడం లేదనే చెప్పవచ్చు. ఇదొక్కటే కాదు.. అన్నం తినే ముందు ఒక ముద్ద తీసి కంచం పక్కన పెట్టడం, మంత్రాలు చదవడం, ప్రార్థన చేయడం వంటివి చేసేవారు. ఇలా చేయడం వల్ల అన్నం విలువ తెలుస్తుందని తమ పిల్లలకు తెలియజేస్తుంటారు. అయితే భోజనం తినే ముందు పెద్దలు తినే కంచం (ప్లేట్) చుట్టూ నీళ్లు చల్లుతుంటారు. ఇలా ఎందుకు చేస్తున్నారు అని సందేహం కచ్చితంగా వచ్చే ఉంటుంది. ఏదైనా శుభకార్యానికి వెళ్లినా, పంక్తిలో భోజనం వడ్డించే సమయంలో అరిటాకు వేస్తారు.

Advertisement

ఇక ఆ సమయంలో నీళ్లు చల్లి అరిటాకుని శుభ్రం చేసుకుంటారు. ఆ తర్వాత అరిటాకు చుట్టూ నీళ్లు చల్లుతారు. ఇదొక ఆచారంగా పాటిస్తూ వస్తున్నారు. అయితే ఇది మతపరమైన ఆచారం మాత్రమే కాదు. దీని వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది. పూర్వం అరిటాకుల్లో భోజనం చేసేవారు. ఆ తర్వాత మట్టి పాత్రలు, సేవెండి కంచాలు, స్టీలు ప్లేట్లు వచ్చాయి. వెండి కంచాలు, బంగారు పళ్ళాల్లో అన్నం తినే వారు కూడా ఉంటారు. అయితే అప్పటికీ, ఇప్పటికీ తినే పాత్రలు మారాయి గానీ తినే ముందు పాత్ర చుట్టూ నీరు చల్లడం అన్న కాన్సెప్ట్ మారలేదు. ఇప్పటికీ చాలా మంది తినే ముందు అరిటాకు చుట్టూనో, కంచం చుట్టూనో నీళ్లు చల్లడం అన్నది ఒక అలవాటుగా చేస్తున్నారు. అయితే ఇలా చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది మతపరమైన కారణమైతే, రెండవది శాస్త్రీయ కారణం. తినే ముందు కంచం చుట్టూ నీరు చల్లడం వల్ల అన్నపూర్ణ దేవికి, ఇష్టదైవానికి గౌరవం ఇచ్చినట్టు అవుతుందని నమ్ముతారు.

Advertisement

పూర్వం అందరూ నేలపై కూర్చుని తినేవారు. అప్పట్లో మట్టితో చేసిన నేలలే ఉండేవి. ఇప్పటికీ అనేక మంది ఇళ్లలో మట్టి నేలలు ఉంటాయి. కింద కూర్చుని తినే సమయంలో కీటకాలు, పురుగులు అరిటాకులోకి రాకుండా నివారించేందుకు ఇలా నీరు చల్లేవారు. అంతేకాదు నీటిని చల్లడం వల్ల మట్టిని తేమ చేస్తుంది. ఆ సమయంలో గాలి వీచినా కూడా మట్టి రేణువులు ఎగరవు. దీని వల్ల తినే అన్నంలో మట్టి పడదు. మట్టి పడకూడదన్న ఉద్దేశంతోనే పూర్వం పెద్దలు నేల మీద కూర్చుని తినే సమయంలో ఆకు చుట్టూ నీరు చల్లేవారు. కాలక్రమేణా అదే అలవాటుని కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు కాలంతో పాటు కట్టుబాట్లు కూడా మారాయి. కింద కూర్చుని తినే వారు ఇప్పుడు లేరు. దాదాపు చాలా మంది డైనింగ్ టేబుల్ మీదనే కూర్చొని తింటున్నారు. కింద కూర్చుని తిన్నప్పటికీ.. మట్టి నేలలు కాదు కాబట్టి నీళ్లు చల్లే ఆచారాన్ని పాటించేవారు లేరు. ఒకవేళ ఉంటే నమ్మకంగా పాటించేవారు చాలా  తక్కువ మంది ఉంటారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

శనివారం రోజు పొరపాటున కూడా ఈ వస్తువులను దానం చేయకండి..

ఆదివారం మాంసాహారం తినడం వల్ల కలిగే నష్టాలు !

మీ భార్యలో ఈ ఒక్క లక్షణం కనిపించిందంటే మరొకరితో రిలేషన్ లో ఉన్నట్టే..?

Visitors Are Also Reading