Home » వెంకటేష్ – రాజమౌళి కాంబినేషన్ లో ఆగిపోయిన సినిమా ఏంటో తెలుసా ?

వెంకటేష్ – రాజమౌళి కాంబినేషన్ లో ఆగిపోయిన సినిమా ఏంటో తెలుసా ?

by Bunty
Ad

హీరో వెంకటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అనేక సినిమాలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. వయసు పెరిగినప్పటికీ వరుస సినిమాలను చేసుకుంటూ దూసుకుపోతున్నారు. తెలుగుతో పాటు హిందీలో కూడా సినిమాల్లో నటించారు. ఇప్పటివరకు 85 సినిమాలకు పైగా నటించిన వెంకటేష్ తన నటనకుగాను ఏడు నంది అవార్డులను గెలుచుకున్నాడు. ఈయన తన సినిమాల ద్వారా ఎంతోమంది హీరోయిన్స్ ను తెలుగు తెరకు పరిచయం చేశారు.

Advertisement

ఒక్కో హీరోకు ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. కానీ హీరో వెంకటేష్ మాత్రం అన్ని జానర్ లో నటించి ఫిదా చేస్తూ ఉంటారు. లవ్, సెంటిమెంట్, మాస్, ఫ్యామిలీ అన్ని జానర్స్ లో తిరుగులేని నటుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. తన నటనకు ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. వయసు పెరిగినప్పటికీ తన సినిమాలకు మాత్రం ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. ఇదంతా పక్కకు పెడితే వెంకటేష్ కు తన డ్రీమ్ ప్రాజెక్ట్ స్వామి వివేకానంద బయోపిక్ అని పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే.

Advertisement

అందుకే ఈ ప్రాజెక్టును రాజమౌళి డైరెక్ట్ చేయవలసిందిగా మగధీర సినిమా సమయంలోనే అడిగాడు వెంకటేష్. దానికి రాజమౌళి కూడా ఓకే చెప్పాడట. కానీ వరుస సినిమాలతో రాజమౌళి బిజీగా ఉండడం వల్ల చేయలేకపోతున్నారట. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించిన వెంకటేష్ తన 100వ సినిమాను స్వామి వివేకానంద బయోపిక్ రూపంలో పరిచయం చేయాలని అనుకుంటున్నారట. మరి ఈ సినిమాకు ఎవరు డైరెక్షన్ చేస్తారో అనే విషయం తెలియాలంటే వేచి ఉండాల్సిందే. ప్రస్తుతం వెంకటేష్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

శ్రీ రెడ్డిని దారుణంగా మోసం చేసిన తేజ ?

విరాట్ కోహ్లీ ఫిట్నెస్ గా ఉండేందుకు రోజు ఏం తింటాడో తెలుసా ? అతనికి ఏ ఫుడ్ అంటే ఇష్టం !

2018 : ఓటిటిలోకి వచ్చేసిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘2018’

Visitors Are Also Reading