Home » గర్వపడేలా మార్కులు తెచ్చుకున్న సూర్య కూతురు..!

గర్వపడేలా మార్కులు తెచ్చుకున్న సూర్య కూతురు..!

by Sravya
Ad

కొన్ని రోజుల క్రితం సూర్య కొడుకు కరాటే లో బ్లాక్ బెల్ట్ సాధించడం ద్వారా తల్లిదండ్రులకి ఎంతో సంతోషం కలిగింది. నటుడు సూర్య గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించే ప్రేక్షకులకు దగ్గర అయిపోయారు. సూర్య కొడుకు కరాటే లో బ్లాక్ బెల్ట్ సాధించారు. ఈ సంఘటనని మరువకు ముందే సూర్య కూతురు దియా 12వ తరగతి పరీక్షల్లో 600 మార్కులకు ఏకంగా 581 మార్కుల్ని సాధించి వార్తల్లో నిలిచారు.

Advertisement

గతంలో కూడా పరీక్షల్లో మంచి మార్కులు సాధించింది ఇప్పుడు కూడా పరీక్షల్లో సత్తా చాటింది. ముంబైలోని పాపులర్ స్కూల్స్లో ఒకటైన ధీరుభాయ్ అంబానీ స్కూల్లో చదువుతోంది. ఫిజిక్స్ లో 99, కెమిస్ట్రీలో 98 , కంప్యూటర్ సైన్స్ లో 97 మార్కులు సాధించింది. ఇంగ్లీష్ లో 96 అకౌంట్స్ లో 94 అలానే ఇంకో సబ్జెక్టులో 96 మార్కులు సాధించింది. దియా కి మంచి మార్కులు రావడంతో కుటుంబ సభ్యుల ఆనందం రెట్టింపయ్యింది.

Also read:

Advertisement

సూర్య పిల్లలు భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని ఉన్నత శిఖరాలని అవరోధించాలని అంతా కామెంట్స్ చేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలని అందుకోవాలని సూర్య ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారా లేదంటే బిజినెస్ లోకి వెళ్తారా లేకపోతే తన తండ్రి లాగ నటుడుగా మారతారా అని ఫ్యాన్స్ లో డౌట్ ఉంది. సూర్య ప్రస్తుతం కంగువా సినిమాతో బిజీగా ఉన్నారు. కంగువా మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో ఎక్కుతుండగా సూర్య ఈ మూవీలో ఎటువంటి రిజల్ట్ ని అందుకుంటారో చూడాలి. మూవీ ఇండస్ట్రీని షేక్ చేస్తుందని కామెంట్లు వస్తున్నాయి. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading