Home » ఎన్టీఆర్ మూవీ ఫ్లాప్ కావడంతో ట్యాంక్ బండ్ లో దూకిన నిర్మాత.. అతను ఎవరంటే..?

ఎన్టీఆర్ మూవీ ఫ్లాప్ కావడంతో ట్యాంక్ బండ్ లో దూకిన నిర్మాత.. అతను ఎవరంటే..?

by Anji
Ad

ఇండస్ట్రీలో సినిమా హిట్, ఫ్లాప్ అన్నది సర్వసాధారణమే. ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు.. తమిళం, కన్నడం, మలయాళం దేశవ్యాప్తంగా కాదు.. ప్రపచం వ్యాప్తంగా కూడా కొన్ని సందర్భాల్లో భారీ హిట్, మరికొన్ని సందర్భాల్లో డిజాస్టర్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. సినిమా హిట్ అయినప్పుడు నిర్మాతకు ఎన్ని కోట్లు లాభాలు వస్తాయో వాటితో తరువాత ఏ స్టార్ హీరోతో ఎలాంటి ప్రాజెక్ట్ చేస్తాడనే విషయంలో చాలా ఊహగానాలున్నాయి. సాధారణంగా ఒక సినిమా ఫ్లాప్ అయితే సినీ నిర్మాత వెనుక వేల కోట్ల ఆస్తులు ఉంటేనో, వెనుకాల బడా వ్యాపారవేత్తలు,రాజకీయ నాయకుల అండ ఉంటేనో మళ్లీ సినిమాలు చేసే ప్లాన్ చేస్తారు. ఇలాంటివేవి లేకుంటే గమ్మున ఉండాల్సిందే. 

Advertisement

టాలీవుడ్ లో కొంతమంది నిర్మాతలు రెండు, మూడు సినిమాలు డిజాస్టర్ అయినా సరే మరో సినిమాను నిర్మిస్తుంటారు. వారికి మరో సినిమా సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం ఉంటుంది.  అందరూ నిర్మాతలు మాత్రం అలా ఉండరు. కొన్ని సందర్భాల్లో భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమా ఫ్లాప్ అయితే ఆ నిర్మాత  క్షణికావేశంలో మరణించడానికి కూడా వెనుకాడరు. ఇలాంటి ఓ సంఘటన యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఓ సినిమా విషయంలో చోటు చేసుకుంది. అప్పట్లో స్టూడెంట్ నెంబర్ వన్, ఆది, సింహాద్రి వంటి ఇండస్ట్రీ హిట్స్ అందుకొని టాలీవుడ్ లో పెద్ద హీరోలతో సమానంగా స్టేటస్ సంపాదించుకున్నాడు. డ్యాన్స్ కూాడా సూపర్ చేస్తుండటంతో క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.  దీంతో బడా నిర్మాతలు సైతం  జూనియర్ ఎన్టీఆర్ తో సినిమాలు చేసేందుకు క్యూ కట్టేవారు. వారిలో చెంగళ వెంకట్రావు ఒకరు. ఈయన అంతకుముందు నందమూరి బాలకృష్ణ-బి.గోపాల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సమరసింహారెడ్డి సినిమాను నిర్మించారు.

Advertisement

అప్పట్లో ఈ మూవీ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.  సమరసింహారెడ్డి  నిర్మాతకు మంచి లాభాలను తీసుకొచ్చింది.  ఇక ఆ తరువాత సినిమాను బి.గోపాల్-జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో  ఓ సినిమాను నిర్మించారు చెంగల వెంకట్రావు. ఆ  సినిమానే నరసింహుడు. ఇందులో సమీరారెడ్డి, అమిషా పటేల్ హీరోయిన్స్ గా నటించారు. ఆర్తి అగర్వాల్ ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించింది.  ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ తో బడ్జెట్ భారీగానే ఖర్చు చేశారు. సినిమా ఫైనల్ కాపీ చూసుకున్నప్పుడే సినిమా సరిగ్గా ఆడదనే మాట చాలా మంది చెప్పారు. అయినప్పటికీ డిస్ట్రిబ్యూటర్స్ కి నమ్మకం కలిగించి సినిమాను అమ్మేశాడు నిర్మాత. సినిమా విడుదలైన మార్నింగ్ షోకే ఫ్లాప్ అని టాక్ వచ్చేసింది.

ఈ సినిమాకి  పెట్టిన పెట్టుబడిలో దాదాపు 20 శాతం కూడా తిరిగి రాలేదు. దీంతో డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఒత్తిడి మొదలైంది. భారీ నష్టాలు తప్పవని భావించి నిర్మాత ఆ నష్టాలను పూడ్చే దారిలేక  హైదరాబాద్ ట్యాంక్ బండ్ లో దూకాడు. వెంటనే అక్కడ ఉన్న వారు చూసి కాపాడటంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ సమయంలో ఈ సినిమాపై రకరకాల వార్తలు వినిపించాయి.  అదే సమయంలో ఎన్టీఆర్ తాను తీసుకున్నటువంటి రెమ్యునరేషన్ లో 6 కోట్ల వరకు నిర్మాతకు తిరిగి ఇచ్చాడట. ఇక  ఈ సినిమా తరువాత నిర్మాత చెంగల వెంకట్రావు ఏ  సినిమాను కూడా నిర్మించలేదు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

వైస్రాయ్ ఘటన తరువాత రోజు పురంధేశ్వరితో ఎన్టీఆర్ ఏమన్నారో తెలుసా ?

Baby Movie OTT : ‘బేబి’ మూవీ వచ్చేది ఆ ఓటీటీలోనే !

బేబీ మూవీ గురించి సుకుమార్ ఏమన్నారో తెలుసా ?

Visitors Are Also Reading