Home » బేబీ మూవీ గురించి సుకుమార్ ఏమన్నారో తెలుసా ?

బేబీ మూవీ గురించి సుకుమార్ ఏమన్నారో తెలుసా ?

by Anji
Ad

ఇటీవలే విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతూ థియేటర్లు అన్ని హౌస్ ఫుల్ చేస్తున్న మూవీ ఏదైనా ఉందంటే ఇప్పుడు బేబీ మూవీ అనే చెప్పాలి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఇటీవలే విడుదలై థియేటర్స్ విజయవంతంగా ప్రదర్శించబడుతూ.. రికార్డు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ బేబీ మూవీపై చేసిన కామెంట్స్ ప్రస్తుం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాయిరాజేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జులై 14న విడుదలైంది. మూవీ విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇప్పటివరకు ఈ మూవీ దాదాపు రూ.35 కోట్ల వరకు వసూలు చేసినట్టు టాక్ వినిపిస్తోంది. 

Advertisement

మంచి సినిమా ఏది అయినా థియేటర్స్ కి వచ్చిన ఆ సినిమా చూసి ఆ చిత్ర యూనిట్ ని అభినందించే అలవాటు ఉన్న స్టార్ దర్శకుడు సుకుమార్ లేటెస్ట్ గా సెన్షేషన్ సృష్టిస్తున్న బేబీ మూవీ చూసి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఇలా స్పందించాడు. “ చాలా కాలం తరువాత ఓ అసాధారణమైన కథ రచనను సినిమాగా చూశాను. కచ్చితంగా ఈ మూవీ, కథ రచనలో కొత్త ఒరవడిని, కొత్త పంథాను తీసుకొస్తుంది. ప్రతి సన్నివేశం నాకు సస్పెన్స్ థ్రిల్లర్ లా అనిపించింది. ఈ సినిమాలోని సన్నివేశాలను పాత్రల మాదిరిగా చూడటం ఇదే తొలిసారి. ఈ చిత్ర దర్శకుడు సాయి రాజేష్ కి నా అభినందనలు. అలాగే మంచి సినిమాని నమ్మి సాధికారత కల్పించినందుకు ఎస్.కే.ఎన్, మారుతిలను అభినందిస్తున్నాను. 

Advertisement

ఇప్పటివరకు రాసిన ఐకానిక్ పాత్రల్లో వైష్ణవి క్యారెక్టర్ ఒకటి. హీరోయిన్ వైష్ణవి చైతన్య ఆ పాత్రకు పూర్తిగా న్యాయం చేసింది. ఆనంద్ క్యారెక్టర్ మత్తుగా అనిపించింది. విరాజ్ నటన చాలా బాగుంది. విజయ్ బుల్గానిన్ సంగీతం కూడా సూపర్. ఇక బాలరెడ్డి సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మెలోడియస్ ట్యూన్ లా ఉంది. గ్రాండ్ సక్సెస్ సాధించినందుకు బేబీ టీమ్ మొత్తానికి నా అభినందనలు”  అంటూ దర్శకుడు సుకుమార్ చెప్పుకొచ్చారు. దీంతో మూవీ టీమ్ కి మంచి ఎనర్జీ ఇచ్చిందనే చెప్పవచ్చు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

టాలీవుడ్ సినిమాల నుంచి కాపీ కొట్టి తీసిన హాలీవుడ్ చిత్రాలు ఏవో తెలుసా..?

వామ్మో.. 513 అంతర్జాతీయ అవార్డులు.. ‘బేబీ’ సెకండ్ హీరో విరాజ్ అశ్విన్ బ్యాక్ గ్రౌండ్ తెలుసా ?

Visitors Are Also Reading