దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. రాజమౌళి తెరకెక్కించే ప్రతి సినిమాకి కూడా కథ అందిస్తాడు విజయేంద్రప్రసాద్. తనపై తన సినిమాలపై వచ్చే ఆరోపణల గురించి స్పందించి.. సమాధానం ఇచ్చే విషయంలో కూడా విజయేంద్ర ప్రసాద్ ముందు వరుసలోనే ఉంటారు అనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా రాజమౌళి తెరకెక్కించే సినిమాలకు సంబంధించి చాలా సన్నివేశాలు కాపీ అనే కామెంట్స్ వినిపిస్తుంటాయి. హాలీవుడ్ సినిమాల నుంచి జక్కన్న స్ఫూర్తి పొందుతారని చెబుతూ కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంటాయి.
Advertisement
గతంలోనే ఈ కామెంట్ల గురించి విజయేంద్ర ప్రసాద్ స్పందించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కథ చెప్పిన తర్వాత సినిమాకు సంబంధించి నా జోక్యం ఉండదని పేర్కొన్నారు. రైటర్, దర్శకుడి మధ్య మంచి రిలేషన్ ఉంటేనే సినిమా చాలా బాగుంటుందని విజయేంద్రప్రసాద్ తెలిపారు. ఇవాళ నచ్చిన సీన్లు పదేళ్ల తర్వాత నచ్చకపోవచ్చు అని ఆయన కామెంట్స్ చేయడం గమనార్హం. నేను సినిమాలను చాలా తక్కువగా చూస్తానని పేర్కొన్నారు విజయేంద్రప్రసాద్. బేసిక్ ఎమోషన్స్ పదో, పన్నెండో ఉంటాయని చెప్పుకొచ్చారు. అయితే బాహుబలి సినిమాకు రాజమౌళి చాలా టెన్షన్ పడ్డారని విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్ చేయడం గమనార్హం. బాహుబలి విడుదలైన తర్వాత కొవ్వూరులో పుష్కరాలకు వెళితే అక్కడ అందరూ బాహుబలి సినిమా గురించే మాట్లాడుకుంటున్నారని ఆయన వెల్లడించారు.
Advertisement
బౌండెడ్ స్క్రిప్ట్ తోనే రాజమౌళి సినిమా తీస్తాడని.. ఇక ఆ తర్వాత చిన్న చిన్న మార్పులు మాత్రమే చేస్తాడని విజయ ప్రసాద్ తెలిపారు. అయితే బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ నటించిన శివగామి పాత్రకు కైకేయి స్ఫూర్తిగా ఉండవచ్చని కామెంట్స్ చేశారు. రామాయణము మహాభారతము చిన్నప్పటినుంచి బ్లడ్ లో ఉన్నాయని విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. అందుకే రమ్యకృష్ణ శివగామి పాత్రకు చాలా బాగుంటుందని ఊహించినట్టు తెలిపారు. అవంతిక పాత్రకు తమన్నా అసలు సూటు కాదని తాను అనుకున్నానని.. కానీ ఆమె ఆ పాత్రకు చాలా న్యాయం చేసిందని జయేంద్ర ప్రసాద్ వెల్లడించడం గమనార్హం.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
పాప ఎవరి పోలికనో చెప్పేసిన రామ్ చరణ్.. పేరు కూడా ఫిక్స్..!
గుంటూరు కారం నుంచి బ్రేకింగ్ న్యూస్.. పూజా స్థానంలో మీనాక్షి..?
తమన్నా, కోహ్లీ పర్సనల్ వీడియోలీక్.. షాక్ లో అనుష్క ?