Home » పాప ఎవరి పోలికనో చెప్పేసిన రామ్ చరణ్.. పేరు కూడా ఫిక్స్..!

పాప ఎవరి పోలికనో చెప్పేసిన రామ్ చరణ్.. పేరు కూడా ఫిక్స్..!

by Anji
Ad

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన తల్లిదండ్రుల క్లబ్ లోకి చేరిన విషయం తెలిసిందే. జూన్ 20న జూబ్లీహిల్స్ ఆసుపత్రిలో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. డెలివరీ ముందు రోజే ఉపాసనతో పాటు చరణ్ కూడా అపోలో ఆసుపత్రిలో ఉన్నారు. వారసురాలు రాకతో మెగా కుటుంబంలో సంబురాలు అంబురాన్ని అంటాయి. తెలుగు రాష్ట్రాల్లోని మెగా అభిమానులు గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. నాలుగు రోజుల నుంచి అపోలో ఆసుపత్రిలోనే ఉన్న ఉపాసన ఇవాళ శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు.  

Advertisement

అయితే ఇప్పుడు అందరూ చర్చించుకునేది రామ్ చరణ్-ఉపాసన బిడ్డ గురించే.. రామ్ చరణ్ పోలికా ? ఉపాసన పోలికా ? అనే ప్రశ్న తలెత్తుతుంది. తాజాగా ఆ ప్రశ్నలకు సంబంధించి రామ్ చరణ్ నుంచి పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చింది. చరణ్ ఉపాసన దంపతుల కూతురుకు పేరు కూడా ఫిక్స్ అయిందని అతి త్వరలో ఆ పేరుకు సంబంధించి అధికారికంగా క్లారిటీ రానుంది. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. అపోలో వైద్యులు ఉపాసనను, పాపను చాలా బాగా చూసుకున్నారని చెప్పుకొచ్చాడు. తల్లి, బిడ్డ ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు. వీరు ఆరోగ్యంగా ఉండాలని పూజలు చేసిన అభిమానులకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు రామ్ చరణ్. మెగా అభిమానులు చూపిస్తున్న ప్రేమకు నాకు మాటలు రావడం లేదన్నారు చరణ్. అభిమానుల ఆశీస్సులు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

Advertisement

బిడ్డ నా పోలిక అని వెల్లడించారు రామ్ చరణ్. ఒక తండ్రిగా ఇంతకు మించిన సంతోషం ఉండదని.. వెల్లడించారు రామ్ చరణ్. నాన్న చాలా సంతోషంగా ఉన్నారు. పాప పుట్టినా బాబు పుట్టినా ఏ పేరు పెట్టాలో ముందే ఫిక్స్ అయ్యామని రామ్ చరణ్ చెప్పాడు. ఆ పేరును ఇప్పుడే చెప్పలేనని.. పేరు పెట్టే రోజు స్వయంగా నేను వెల్లడిస్తానని రామ్ చరణ్ కామెంట్ చేశారు. ప్రస్తుతం రామ్ చరణ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.  రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాకి సంబంధించి అప్డేట్ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

పూరి జగన్నాథ్ తమ్ముడు ఎమ్మెల్యే అనే విషయం మీకు తెలుసా ?

లెజెండ్ మూవీలో నటించిన ఈ చిన్నారి ఎవ్వరో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

చిరంజీవి సినిమానే భయపెట్టిన రవితేజ మూవీ.. ఫస్ట్ మూవీతోనే ఆ డైరెక్టర్ రికార్డు..!

Visitors Are Also Reading