Home » ప్రతీ రోజూ ఈ గింజలు తిన్నారంటే బరువు తగ్గడం పక్కా..!

ప్రతీ రోజూ ఈ గింజలు తిన్నారంటే బరువు తగ్గడం పక్కా..!

by Anji
Ad

ప్రస్తుత జీవన శైలి విధానంలో ఊబకాయం సమస్య ప్రతీ ఒక్కరినీ వేధిస్తోంది. ముఖ్యంగా బయటి ఫుడ్ ఎక్కువగా తినడం, చేతిలో మొబైల్ పట్టుకొని అర్థరాత్రి వరకు నిద్ర పోకుండా నేటి తరం యువత వ్యవహరిస్తున్నారు. చిన్న వయస్సులోనే శరీరం బరువు అమాంతం పెరిగిపోతుంది. ఫిట్ గా ఉండేందుకు గంటల తరబడి జిమ్ లలో కసరత్తు చేసినంత మాత్రాన బరువు తగ్గరు అని నిపుణులు పేర్కొంటున్నారు. 

Also Read :   పేపర్ కప్పులో టీ తాగితే అంత డేంజరా?

Advertisement

ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాల్లో చియా గింజలు ముఖ్యమైంది. చియా విత్తనాలు బరువు తగ్గడంలో ఉపయోగపడుతాయని నిపునులు పేర్కొంటున్నారు. ఈ గింజల్లో ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే ఎక్కువ సేపు కడుపునిండుగా ఉంచుతుంది. ఎందుకు అంటే చియా గింజలు జీర్ణక్రియను నెమ్మది చేసి కొవ్వును కరిగిస్తుంది. పాలు , చక్కర, డికాషన్ తో టీ తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. అయితే చియా గింజలతో చేసిన టీ తాగితే పొట్టలోని కొవ్వును వేగవంతంగా కరిగించవచ్చు. 

Advertisement

Also Read :  వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే… ఈ 5 తప్పులు అస్సలు చేయకండి….!

 

గ్లాస్ నీటిలో కాసిన్ని చియా గింజలు వేసి మరిగించి, నీరు సగం కాగానే ఓ కప్పులోకి తీసుకొని నెమ్మదిగా తాగాలి. చియా విత్తనాలను రాత్రి అంతా నీటిలో నానబెట్టి నీటిని వడకట్టి, ఉదయాన్నే పెరుగులో లుపుకొని తినాలి. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండటంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో చియాగింజల వాటర్ తాగడం వల్ల పొట్ట, నడుపు చుట్టు పేరుకుపోయిన కొవ్వు తగ్గడం ప్రారంభమవుతుంది. త్వరగా బరువు తగ్గాలనుకునే వారు రోజు వారి ఆహారంలో తప్పనిసరిగా చియా గింజలు సలాడ్ ని చేర్చుకోవాలి. పండ్లు, వెజిటబుల్ సలాడ్లలో కలిపి చియా గింజలను తినవచ్చు. శారీరక ఆరోగ్యాన్ని తోడ్పడటమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడంతో సహాయపడుతుంది. 

Also Read :  ఏప్రిల్ 20 శక్తిమంతమైన సూర్యగ్రహణం.. వృశ్చిక రాశి వారికి జరిగేది ఇదే..!

Visitors Are Also Reading