Home » నాలుగు రోజుల్లో ఈ రాశుల వారి జాతకం మారనుంది..! 

నాలుగు రోజుల్లో ఈ రాశుల వారి జాతకం మారనుంది..! 

by Anji
Ad

మార్చి 31న బుధుడు మీన రాశిని వదిలి మేషరాశిలోకి ప్రవేశించాడు. సరిగ్గా రెండు వారాల తరువాత అనగా ఏప్రిల్ 14న సూర్యుడు కూడా మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో ఏప్రిల్ 14న సూర్య, బుధ కలయికతో బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. 12 రాశుల వారిపై ప్రభావం చూపనుంది. ఈ 5 రాశుల వారు ఎక్కువగా లాభ పడుతారు. ఏప్రిల్ 14 నుంచి వీరి జాతకాలు మారిపోనున్నాయని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు. ఏ రాశుల వారికి మేలు జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Also Read : Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు శత్రువులపై విజయం సాధిస్తారు

Advertisement

మిథున రాశి :

ఈ రాశిలోకి 11వ ఇంట బుధుడు ప్రవేశిస్తాడు. ఇల్లు ఆర్థికంగా ప్రయోజనాలకు పెద్ద తోబుట్టువులకు సంబందించిందిగా పరిగణించబడుతుంది. ఈ మార్పు శుభ ప్రభావాలతో, ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మునుపటి కంటే ఎక్కువగా డబ్బు ఆదా చేయగలుగుతారు. మీ  కృషి విజయవంతమవుతుంది. డబ్బు సంపాదించేందుకు కొత్త అవకాశాలు ఏర్పడుతాయి. మీ పాత కోరికలు కొన్ని నెరవేరుతాయి. ఈ సమయంలో మీరు భూమి ఆస్తిని కూడా కొనుగోలు చేయవచ్చు. కుటుంబంలోని ప్రతీ ఒక్కరితో మీ సంబంధాలు బలంగా ఉంటాయి. 

కర్కాట రాశి :

ఈ రాశి వారి కెరీర్ పరంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. పెద్ద కంపెనీలో లేదా బహుళ జాతి కంపెనీలో పని చేసే వారికి ఈ సమయం విజయాలతో నిండి ఉంటుంది. మీ కుటుంబ జీవితం కూడా సంతోషంగా నిండి ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. భార్య, తల్లితో మీ సంబంధం మెరుగు పడుతుంది. 

Advertisement

ధనస్సు రాశి :

బుధుడు ధనస్సు రాశి వారి 5వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. విద్య, ప్రేమ వ్యవహారాలు పిల్లలకు సంబంధించినవి. ఈ సమయం విద్యార్థులు కలిసొస్తుంది. మీరు ఉన్నత విద్యకు సంబంధించిన అద్భుత అవకాశాలు పొందుతారు. చదువు పూర్తయిన తరువాత ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి ప్రెషర్స్ అయిన వారికి అనుకూల సమయం ధనార్జనలో విజయం సాధిస్తారు. 

సింహరాశి :

సింహరాశి వారికి అదృష్టం తలుపు తట్టే అవకాశముంది. ప్రస్తుతం పని చేస్తున్న ప్రాజెక్ట్ లలో విజయం సాధిస్తారు. భవిష్యత్ కోసం డబ్బును ఆదా చేయగలుగుతారు. జీతం పెరిగే అవకాశముంది. తత్వవేత్తలు, రచయితలు, కన్సల్టెంట్లు లేదా ఉపాధ్యాయులు తమ రంగంలో అద్భుతమైన అవకాశాలను పొందుతారు. విద్యార్థులు ముందుకు సాగే అవకాశం ఉంటుంది. 

కుంభ రాశి :

ఈ రాశి వారికి ఇది అనుకూల సమయం. ఆర్థికంగా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎక్కడికైనా వెళ్లాలనే ప్లాన్ కూడా వేసుకోవచ్చు. సినీ పరిశ్రమలో పని చేసే వారికి ఈ సమయం కొత్త అవకాశాలను కూడా అందిస్తుంది. మీ తండ్రితో మీ సంబంధం మెరుగుపడుతుంది. సలహాతో మీరు చేసే పనిలో విజయం సాధిస్తారు. 

Also Read :  పేపర్ కప్పులో టీ తాగితే అంత డేంజరా?

 

Visitors Are Also Reading