Home » కుమారి ఆంటీ నెలకి ఎంత సపాదిస్తుందో తెలుసా.. సాప్ట్ వేర్స్ కూడా పనికి రారుగా..!

కుమారి ఆంటీ నెలకి ఎంత సపాదిస్తుందో తెలుసా.. సాప్ట్ వేర్స్ కూడా పనికి రారుగా..!

by Anji
Ad

వంట మాస్టర్ కుమారీ ఆంటీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. సోషల్ మీడియా పుణ్యాన కుమారి ఆంటీ చాలా ఫేమస్ అయింది. హైదరాబాద్ లో రోడ్డు పక్కనే ఫుడ్ పెట్టి జీవనోపాధి జరుపుకుంటున్నారు. ఈమె ఎన్నో రకాల నాన్ వెజ్ ఆహార పదార్థాలను తక్కువ ధరలకే అమ్ముతూ ఎంతో మంది ఆకలిని తీరుస్తున్నారు. ఫుడ్ రేట్ తక్కువగా ఉండటంతో ఎంతో మంది కుమారి ఆంటీ ఫుడ్ టేస్డ్ చేసేందుకు ఎగబడుతూ వచ్చేవారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికీ వచ్చి ఈమె ఫుడ్ టేస్ట్ చేయడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Advertisement

దీంతో పోలీసులు కుమారి ఆంటీ బిజినెస్ ను క్లోజ్ చేసి పంపించారు. దీంతో పెద్ద ఎత్తున వివాదం చోటు చేసుకుంది.  ఈ విషయం పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకునే వారిని ఏమాత్రం ఇబ్బందులు పెట్టకూడదంటూ.. ఆదేశాలు జారీ చేయడంతో తిరిగి ఈమె యదావిధిగా తన బిజినెస్ ప్రారంభించారు. ఇలా ఫుడ్ బిజినెస్ జరుపుకుంటూ ఉన్నటువంటి కుమారి ఆంటీ మీది 1000 అయింది రెండు లివర్స్ ఎక్స్ ట్రా అంటూ చెప్పినటువంటి డైలాగ్ చాలా ఫేమస్ అయిపోయింది. సోషల్ మీడియాలో ఈ డైలాగ్ తో చాలా మంది రీల్స్ చేసేవారు.

Advertisement

ఈమె సోషల్ మీడియాలో ఫేమస్ కావడంతో బుల్లితెర కార్యక్రమాల్లో కూడా సందడి చేశారు. తాజాగా కుమారి ఆంటీ నెల సంపాదన గురించి  ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీకు నెలకు ఎంత వరకు మిగులుతుందనే విషయం గురించి యూట్యూబ్ ఛానల్ వారు ఈమెను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ.. తను ప్రతీ రోజు ఇలా ఎన్నో రకాల ఆహార పదార్థాలను తయారు చేసి అమ్మడం వల్ల అన్ని ఖర్చులు పోను ఒకటిన్నర లక్షల వరకు మిగిలుతుంది అంటూ చెప్పుకొచ్చింది కుమారి ఆంటీ. ప్రస్తుతం ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  కుమారి ఆంటీ సంపాదన ముందు సాప్ట్ వేర్ ఉద్యోగులు కూడా తక్కువే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటలలోపు తన ఫుడ్ బిజినెస్ క్లోజ్ చేస్తారని.. ఈ గంటన్నర వ్యవధిలోనే భారీ సంపాదిస్తున్నారనే చెప్పాలి.

Also Read : ఒత్తిడి ఎక్కువగా వుందా..? అయితే ఇలా చెయ్యండి..!

Visitors Are Also Reading