Home » పెళ్లికి వధూవరుల జాతకాలు కలిసాయని ఎలా చెబుతారో తెలుసా..?

పెళ్లికి వధూవరుల జాతకాలు కలిసాయని ఎలా చెబుతారో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది చాలా స్పెషల్.. కానీ ప్రస్తుత కాలంలో చాలామంది వివాహాన్ని చేసుకునే టైం లో కాకుండా లేటు వయసులో చేసుకుని అనేక ఇబ్బందులు పడుతున్నారు. పూర్వకాలంలో పెళ్లి అంటే కనీసం ఐదు రోజులైనా సందడి ఉండేది.. అలాంటి పెళ్లిలను ఇప్పుడు చాలా కమర్షియల్ గా వెళ్ళామా.. చేసుకున్నామా.. ఫోటో దిగామా..మళ్లీ ఎవరి జాబ్ లోకి వాళ్ళం వెళ్ళామా.. అనే విధంగా చేసుకుంటున్నారు..

Advertisement

also read;పవన్ కళ్యాణ్ ఓ కరివేపాకు.. అంటున్న మంత్రి రోజా..!!

Advertisement

అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లిలలో చాలా విషయాలు పరిగణలోకి తీసుకుంటారు. ముఖ్యంగా పెళ్లిలో వధూవరుల జాతకాలు అనేవి చూస్తారు.. వివాహానికి ముందు వదూవరుల జాతకాలు కలిశాయని ఏవిధంగా చెబుతారో ఇప్పుడు చూద్దాం.. పెళ్లి కుదుర్చుకునే ముందు జాతకాలు చూడడం మన సాంప్రదాయం. ఇది అనతి కాలం నుంచే వస్తోంది.. చాలా కుటుంబాలు వధూవరుల జాతకాలు కలవకపోతే పెళ్లి చేయరు.

మరియు వధూవరుల జాతకాలు కలవడం కోసం ఏవేవి చూస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.. వధూవరుల జాతకం ప్రకారం సప్తమాష్టమ స్థానం చూస్తారు. సప్తమాష్టమ స్థానములు మిత్రరాశులు,మిత్రగ్రహాలైతే వివాహాన్ని నిశ్చయిస్తారు. ఈ విధంగా ఉంటేనే వారి జాతకాలు కలుస్తాయని అబ్బాయికి అమ్మాయికి సెట్ అవుతుందని జాతక నిపుణులు అంటున్నారు.

also read;ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోనున్న విశాల్.. ఇంతకి ఆమె ఎవరంటే ?

Visitors Are Also Reading