Home » ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోనున్న విశాల్.. ఇంతకి ఆమె ఎవరంటే ?

ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోనున్న విశాల్.. ఇంతకి ఆమె ఎవరంటే ?

by Anji
Ad

తమిళ్ స్టార్ హీరో విశాల్ కు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన చాలా సినిమాలు సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. అందులో కొన్ని తెలుగులో కూడా విడుద‌లై మంచి విజయాన్ని అందుకున్నాయి. సహజమైన నటనతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విశాల్‌. ఓవైపు వరస సినిమాలతో బిజీగా ఉండడమే కాకుండా సౌత్ ఇండస్ట్రీ నటీనటుల సంఘం కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Also Read : అచ్యుత్ సినీ ఇండస్ట్రీలోకి రావడానికి అసలు కారణం ఎవరో తెలుసా 

Advertisement

Manam

గత కొద్ది రోజులుగా ఈ హీరో పెళ్లి విషయంపై ఫిల్మ్ సర్కిల్ లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. నటి అభినయ శ్రీ తో విశాల్ ఏడడుగులు వేయనున్నారని రూమర్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో తన వివాహం పై వస్తున్న వార్తలకు కొట్టి ప్రదేశాల అభినయ. తాను ప్రస్తుతం పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలలో ఎలాంటి వాస్తవాలు లేవని తేల్చి చెప్పింది. ఇటీవల చెన్నైలో ఓ సేవా సంస్థ ఆధ్వర్యంలో 11 మంది పేద జంటలకు పెళ్లి జరిపించి, వారికి ఆర్థిక సహాయం చేశారు విశాల్‌. తాజాగా తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు విశాల్.

Advertisement

Also Read : వెంకటేష్ పక్కన పెట్టిన సినిమా తో బ్లాక్ బస్టర్ కొట్టిన నాగార్జున…ఆ సినిమా ఏదంటే…?

Manam

తాను త్వరలోనే ప్రేమ వివాహం చేసుకోబోతున్నానని తెలిపారు విశాల్‌. ప్రేమించిన అమ్మాయిని త్వరలోనే అందరికీ చూపిస్తాను అని చెప్పుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా విశాల్ మాట్లాడుతూ.. “నేను ప్రేమ వివాహమే చేసుకోవాలనుకుంటున్నాను. ఆరెంజ్ మ్యారేజ్ నాకు సూట్ కాదనిపిస్తుంది. నేను ప్రేమించిన అమ్మాయితోనే ఏడడుగులు వేస్తాను. ఆ అమ్మాయిని అతి త్వరలోనే మీకు పరిచయం చేస్తాను” అంటూ చెప్పుకొచ్చారు. మూడేళ్ల క్రితం హైదరాబాద్ కు చెందిన అనీషా రెడ్డితో విశాల్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అయితే కొద్ది నెలలకే వీరి తమ వివాహాన్ని రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం విశాల్ యాక్టర్స్ యూనియన్ బిల్డింగ్ కడుతున్నామని.. మూడేళ్లలో నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. ఈ భవన నిర్మాణం పూర్తయిన వెంటనే పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేశారు. దీంతో విశాల్ ప్రేమించిన అమ్మాయి ఎవరా అంటూ సోషల్ మీడియాలో సెర్చింగ్ స్టార్ట్ చేశారు అభిమానులు.

Also Read : జులాయి, అల వైకుంఠ పురం సినిమాలలో ఉన్న ఒకే కామన్ పాయింట్ ను గమనించారా…?

 

Visitors Are Also Reading