Home » రాజమౌళి-అల్లరి నరేష్ కాంబినేషన్ లో మిస్ అయిన సూపర్ హిట్ సినిమా ఏదో తెలుసా ?

రాజమౌళి-అల్లరి నరేష్ కాంబినేషన్ లో మిస్ అయిన సూపర్ హిట్ సినిమా ఏదో తెలుసా ?

by Anji
Ad

దర్శక ధీరుడు రాజమౌళిని తెలుగు సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కూడా గర్వించదగ్గ దర్శకుడు అనే చెప్పాలి. ఇండియన్ సినిమాకి తన దర్శకత్వ ప్రతిభతో మొట్టమొదటి ఆస్కార్ అవార్డుని తీసుకొచ్చిన మహానుభావుడు రాజమౌళి. అలాంటి దర్శకుడితో సినిమా చేయాలని ఎవ్వరికైనా ఆశ ఉంటుంది. పెద్ద సూపర్ స్టార్స్ సైతం రాజమౌళితో సినిమా కోసం పరితపిస్తుంటారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే.. రాజమౌళి దర్శకత్వం వహించిన మగధీర సినిమాకి ముందు రాజమౌళి ఒక సాధారణ దర్శకుడు మాత్రమే.

Advertisement

 

వరుసగా హిట్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసే సినిమాలు మాత్రం లేవు. ఇక అలాంటి సమయంలో వచ్చిన మగధీర మూవీ రాజమౌళి రేంజ్ ని అమాంతం మార్చేసింది. భారీ అంచనాలు అందరిలో ఎప్పటికీ అందుకోలేని రేంజ్ కి వెళ్లిపోయాయి. ఇక ఆ సమయంలో ఆయన తన రేంజ్ ని తగ్గించుకుంటూ.. కమెడియన్ సునీల్ తో మర్యాద రామన్న మూవీని తెరకెక్కించాడు. ఈ మూవీ కమర్షియల్ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అప్పట్లోనే ఈ మూవీ సుమారుగా 34 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించాయి. ఈ మూవీ ప్రారంభానికి ముందు రాజమౌళి సునిల్ గురించి ఆలోచించడం కంటే ముందే పలువురు హీరోలను సంప్రదించాడట.

Advertisement

వారిలో  అల్లరి నరేష్ ఒకరు. ఈ సినిమా స్టోరీ చెప్పగానే చేయడానికి అల్లరి నరేష్ ఒప్పుకున్నాడు. కానీ ఏడాదికి అరడజన్ కి పైగా చేస్తూ వచ్చే అల్లరి నరేష్ ని సినిమా పూర్తయ్యేంత వరకు మరో ప్రాజెక్ట్ కి కదలకూడదు అని రాజమౌళి ఓ షరత్ పెట్టాడట. అందుకు అల్లరి నరేష్ ఒప్పుకోలేదట. దీంతో ఈ ప్రాజెక్ట్ నరేష్ చేతి నుంచి సునీల్ చేతికి వెళ్లింది. ఈ సినిమా చూసిన ప్రతీ ఒక్కరికీ ఈ సినిమా అల్లరి నరేష్ కి కూడా సరిపోతుంది అని అనిపించింది. ఎందుకు అంటే ఆయన  తన కెరీర్ లో ఇలాంటి పాత్రలే చాలా ఎక్కువగా పోషిస్తూ వచ్చాడు. అలా అల్లరి నరేష్ ఇంత పెద్ద క్రేజీ ప్రాజెక్ట్ ని మిస్ అయ్యాడట. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ఆదిపురుష్ లో హనుమంతుడిగా నటించిన దేవ్ దత్త గురించి ఎవరికీ తెలియని విషయాలు ఇవే..!

 “బొమ్మరిల్లు” సినిమాకు ఆ టైటిల్ ఎలా పెట్టారో తెలుసా? అస్సలు ఊహించి ఉండరు!

‘వ్యూహం’ కథ గురించి క్లారిటీ ఇచ్చిన ఆర్జీవీ.. జగన్ పర్సనల్ లైఫ్ ని సైతం..!

Visitors Are Also Reading