Home » ‘వ్యూహం’ కథ గురించి క్లారిటీ ఇచ్చిన ఆర్జీవీ.. జగన్ పర్సనల్ లైఫ్ ని సైతం..!

‘వ్యూహం’ కథ గురించి క్లారిటీ ఇచ్చిన ఆర్జీవీ.. జగన్ పర్సనల్ లైఫ్ ని సైతం..!

by Anji
Ad

టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. గత కొద్ది సంవత్సరాలుగా రాజకీయ నాయకులను, పార్టీలను టార్గెట్ చేస్తూ వర్మ కొన్ని సినిమాలు కూడా చేస్తున్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ తీసిన విషయం తెలిసిందే. ఇటీవల రామ్ గోపాల్ వర్మ ఏపీ సీఎం జగన్ ని రహస్యంగా కలిసి దాదాపు 40 నిమిషాల పాటు మాట్లాడిన విషయం తెలిసిందే. ఆ సమావేశం తరువాత వ్యూహం, శపథం అనే రెండు సినిమాలు కూడా తీయబోతున్నట్టు ప్రకటించారు.

Advertisement

అదేవిధంగా వై.ఎస్.జగన్ కి సంబంధించిన కథతో వ్యూహం అనే సినిమాను తీస్తానని.. ఇది రెండు పార్టులుగా ఉంటుందని చెప్పాడు. ఎన్నికల సమయానికి విడుదల చేస్తానని ప్రకటించాడు వర్మ. అసలు వర్మ తన వ్యూహంలో ఏం చూపించబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా ఆర్జీవీ ఓ ఇంటర్వ్యూలో వ్యూహం గురించి మాట్లాడారు. “ నా కెరీర్ లో రాజకీయాలకు సంబంధించిన సినిమాలు కేవలం సర్కార్, లక్ష్మీస్ ఎన్టీఆర్ మాత్రమే చేశాను. ఆ తరువాత ఇప్పుడు వ్యూహం తీస్తున్నాను. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలు కేవలం ఎన్నికల సమయంలోనే ఎక్కువగా మార్కెట్ లో సేల్ అవుతాయి. అందుకే వ్యూహం మూవీ విడుదల తరువాత మళ్లీ అయిదేళ్ల వరకు పొలిటికల్ సినిమాలు తీయను.

Advertisement

వ్యూహం సెప్టెంబర్ లో విడుదలవుతుంది. 2024 ఫిబ్రవరిలో వ్యూహం 2   విడుదలవుతుంది”  అని వెల్లడించాడు ఆర్జీవీ. ముఖ్యంగా వ్యూహం సినిమా కథ గురించి చెబుతూ.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వం అంటే తనకు చాలా ఇష్టం అన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తరువాత జగన్ ని తొక్కెయాలని చాలా మంది అనుకున్నారు. కొందరూ కుట్రలు కూడా చేశారు. జగన్ జీవితంలో 2009 నుంచి 2014 వరకు అసలు ఏం జరిగింది ? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది వ్యూహం లో చూపిస్తాను. ఫస్ట్ ఈ మూవీకి ‘కుట్ర’ అనే టైటిల్ పెట్టాలనుకున్నాను. 

ఆ టైటిల్ చాలా చీఫ్ గా ఉంటుందని..  వ్యూహం గా మార్చినట్టు వెల్లడించాడు.  వ్యూహం 2లో జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత జరిగిన పలు విషయాలు, జగన్ వ్యక్తిగత జీవితం గురించి ఉంటుందని క్లారిటీ ఇచ్చారు ఆర్జీవీ. ఈ మూవీలో ఏపీ సీఎం జగన్, వైఎస్ భారతి క్యారెక్టర్ లో ఎవరు నటిస్తున్నారనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అంతకు ముందు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీలో జగన్ పాత్ర చేసిన అజ్మల్ అమీర్ ఈ మూవీలో కూడా జగన్ పాత్రలో కనిపించబోతున్నాడు. వైఎస్ భారతి పాత్రల మానస రాధాకృష్ణన్ నటించబోతున్నట్టు తెలిపాడు. వీరికి సంబంధించిన ఫొటోలు  అభిమానులు చూసి ఈ పాత్రలకు వీళ్లు కరెక్ట్ గా సెట్ అయ్యారు అంటూ కామెంట్స్ కూడా  చేస్తున్నారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 ‘అవతార్’ అభిమానులకు చేదువార్త.. ‘అవతార్’ 3,4,5 విడుదల తేదీలలో భారీ మార్పులు..!

శ్రీలీల చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన చిత్రం ఏదో తెలుసా..?

రైళ్లు పగటి పూట కంటే రాత్రి సమయాల్లో ఎందుకు వేగంగా ప్రయాణిస్తాయి? అసలు కారణం ఇదే!

Visitors Are Also Reading