Home » దసరా వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ స్థానంలో సాయి పల్లవి నటిస్తే ఎలా ఉండేదో తెలుసా ?

దసరా వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ స్థానంలో సాయి పల్లవి నటిస్తే ఎలా ఉండేదో తెలుసా ?

by Anji
Ad

ఇటీవల నేచురల్ స్టార్ నాని దసరా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విషయం విధితమే. నాని ఈ సినిమాతో మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారనడంలో ఎలాంటి సందేహం లేదు. నిన్న మొన్నటి వరకు లవర్ బాయ్ గా అలరించిన నాని దసరా చిత్రంతో మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నారు. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా విడుదలై సూపర్ హిట్ గానే కాదు.. భారీ కలెక్షన్లను కూడా రాబట్టింది. దసరా చిత్రంలో నాని సరసన కీర్తి సురేష్ నటించింది. 

Also Read :  నితిన్ ను నమ్మించి ముంచేసిన టాలీవుడ్ హీరోయిన్…?

Advertisement

ఇందులో నాని ధరణి పాత్రలో నటించగా.. కీర్తి సురేష్ వెన్నెల పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో డీ గ్లామర్ లుక్ లో కనిపించిన ఈ చిన్నది మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కీర్తి డ్యాన్స్ తోనూ ఆకట్టుకుంది. ప్రధానంగా పెళ్లి బారత్ లో కీర్తి చేసిన డ్యాన్స్ అందరినీ ఆకర్షించింది. కొంత మంది వెన్నెల పాత్రలో కీర్తిని తప్ప మరో హీరోయిన్ ను అస్సలు ఊహించుకోలేం.. అంటే.. మరికొంత మంది మాతరం కీర్తితో పాటు ఆ పాత్రకు సాయిపల్లవి కూడా న్యాయం చేస్తుందంటున్నారు. సాయిపల్లవి కూడా నేచురల్ యాక్టింగ్ తో ప్రేక్షకులను కట్టిపడేయగలదు. 

Advertisement

Also Read :  నిర్మాత పరువు తీసిన సమంత… “చెవిలో వెంట్రుకలతో నువ్వు..” అంటూ సాలిడ్ కౌంటర్…!

తెలంగాణ యాస కూడా బాగా మాట్లాడుతుంది. డ్యాన్స్ లో కూడా అదురగొడుతుంది. వెన్నెల పాత్ర సాయిపల్లవి చేసి ఉండుంటే.. ఇంకా బాగుండేది అని ఆమె అభిమానులు అనుకుంటున్నారు. ఈ ఇద్దరూ భామలు వెన్నెల పాత్రకు సరిగ్గా సరిపోతారు. వీరిద్దరూ భామలు తమ సహజ నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ప్రస్తుతం కీర్తి సురేష్ వరుస సినిమాలను లైనఫ్ చేస్తుంటే.. సాయిపల్లవి మాత్రం సైలెంట్ అయింది. గత కొంత కాలంగా ఆమె కొత్త సినిమా అప్టేట్స్ రావడం లేదు. దీంతో అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 

Also Read :   టాలీవుడ్ లో కాకులే కీలకం.. అవి ఉంటే సినిమా హిట్టా ? 

Visitors Are Also Reading