Home » నిర్మాత పరువు తీసిన సమంత… “చెవిలో వెంట్రుకలతో నువ్వు..” అంటూ సాలిడ్ కౌంటర్…!

నిర్మాత పరువు తీసిన సమంత… “చెవిలో వెంట్రుకలతో నువ్వు..” అంటూ సాలిడ్ కౌంటర్…!

by Bunty
Ad

అందానికి అందం, నటనకు నటన కనబరుస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు దశాబ్ద కాలంగా స్టార్ హీరోయిన్ గా హవాను చూపిస్తోంది టాలెంటెడ్ హీరోయిన్ సమంత. ఈ మధ్యకాలంలో సరికొత్త ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ అమ్మడు తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలనే చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు శాకుంతలం అనే చిత్రంతో వచ్చింది. ఏప్రిల్ 14న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి రోజు మొదటి షో తోనే నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది.

READ ALSO : జబర్దస్త్ కమెడియన్ చలాకి చంటికి గుండెపోటు?

Advertisement

ఇది ఇలా ఉంటే మోస్ట్ బ్యూటిఫుల్ సమంతపై సీనియర్ నిర్మాత చిట్టిబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. సమంత కెరియర్ ముగిసిపోయిందని, ఆమె తన సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు ఆసుపత్రిలో ఉన్నట్లుగా ఆరోగ్యం బాగాలేదని చెబుతూ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందని చిట్టిబాబు అన్నారు. అంతేకాకుండా తన ఎప్పుడు అందంగా లేదు, ఆమెది ముసలి ముఖం అంటూ తదితర కామెంట్స్ చేశాడు చిట్టిబాబు.

Advertisement

READ ALSO : నాకు అదే చివరి మ్యాచ్… రిటైర్మెంట్ పై ధోని సంచలన ప్రకటన

అయితే తాజాగా చిట్టిబాబుపై తనదైన స్టైల్ లో సెటైర్ వేసింది ముద్దుగుమ్మ సమంత. ఇన్ స్టా వేదికగా ఓ స్టోరీ షేర్ చేసింది. అందులో వ్యక్తుల చెవుల నుంచి జుట్టు ఎలా పెరుగుతుందని గూగుల్ లో సెర్చ్ చేసే దాన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టింది. ఇలా చెవులలో నుంచి వెంట్రుకలు బయటకు రావడానికి టెస్టోస్టెరాన్ ఎక్కువగా ఉండడం వల్ల అని ఉంది. దీనికి ‘ఇఫ్ యు నో…యు నో’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ కాగా చిట్టిబాబు పైన ఇన్ డైరెక్ట్ గా సామ్ సెటైర్ వేసిందని అనుకుంటున్నారు నెటిజెన్లు.

READ ALSO :  చిరంజీవికు బాలయ్య పంచ్…ఇది మామూలుగా లేదుగా!

Visitors Are Also Reading